రా ఫ్లేవర్‌‌‌‌తో విధి

రా ఫ్లేవర్‌‌‌‌తో విధి

రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ దర్శకత్వంలో ఎస్ రంజిత్ నిర్మించిన చిత్రం ‘విధి’. ఈరోజు సినిమా విడుదలవుతోన్న సందర్భంగా రోహిత్ నందా మాట్లాడుతూ ‘నా రియ‌‌ల్ లైఫ్ క్యారెక్టర్‌‌కి పూర్తి భిన్నంగా ఉండే  రోల్‌‌ చేశా. రా ఫ్లేవ‌‌ర్‌‌తో సినిమా ఉంటుంది. 

లుక్‌‌, డ్రెస్సింగ్ స్టైల్ ఇలా అన్ని విష‌‌యాల్లో ముందే హోం వర్క్ చేసుకున్నాం. ఎమోషన్, క్రైమ్ సీన్స్‌‌లో నటించేటప్పుడు టఫ్‌‌గా అనిపించింది. తర్వాత ఈ సన్నివేశాలను ఇంటెన్స్‌‌గా చేశానని సెట్‌‌లో అందరూ క్లాప్స్ కొట్టారు.  

ఆనంది సెలెక్టివ్‌‌గా సినిమాలు చేస్తుంటారు. కథ నచ్చితేనే ఆమె ఒప్పుకుంటుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. ఇద్దరు దర్శకులు అయినప్పటికీ ఎక్కడా క్లాష్  రాకుండా క్లారిటీతో తీశారు’ అని చెప్పాడు. యూట్యూబ్ వీడియోస్ చేసిన అనుభవంతో ఈ సినిమా తీశామని దర్శకులు చెప్పారు.