ఆగస్టులో విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి మూవీ రిలీజ్

ఆగస్టులో విజయ్ ఆంటోనీ నాన్న కుట్టి మూవీ రిలీజ్

తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌‌తో విజయ్ ఆంటోనీ లీడ్‌‌గా నటిస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. ము.మారన్ దర్శకత్వం వహిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. రామాంజనేయులు జవ్వాజీ కో  ప్రొడ్యూసర్‌‌‌‌గా  వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. 

 ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టులో సినిమా రిలీజ్‌‌ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలియజేశారు.  తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బంధాన్ని  హైలైట్ చేస్తూ యాక్షన్  ప్రధానంగా ఈ మూవీని రూపొందిస్తున్నామని అన్నారు.

  తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌లో విజయ్ ఆంటోని తన కూతురిని భుజాలపై  ఎత్తుకుని ఉండగా, ముఖంపై దెబ్బలు ఉండటం ఆసక్తిని పెంచుతోంది.  ఈ చిత్రంలో ప్రీతి అస్రాని,  లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.