Vijay Binni Vishwambhara : చిరు సినిమాకు కొరియోగ్రఫీ..విజయ్ బిన్ని జెర్సీ హ్యాపీ మూమెంట్..

Vijay Binni Vishwambhara : చిరు సినిమాకు కొరియోగ్రఫీ..విజయ్ బిన్ని జెర్సీ హ్యాపీ మూమెంట్..

డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని (Vijay Binni) తెలుగులో 100కి పైగా సినిమాలకు నృత్య రీతులు సమకూర్చాడు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీ6లో ఫేమస్ డ్యాన్స్ మాస్టర్గా గుర్తింపు పొందాడు విజయ్. ఇప్పుడు విజయ్ బిన్నీ డైరెక్టర్గా మారుతూ నాగార్జునతో నా సామిరంగ (Naa Saami Ranga) మూవీని తక్కువ కాలంలో తెరకెక్కించి సంక్రాంతి బరిలో నిలిచి హిట్ కొట్టాడు. 

లేటెస్ట్గా విజయ్ బిన్ని తన జీవితంలో అనుకున్న అసలైన విజయం సాధించానంటూ తనదైన శైలిలో తెలిపాడు.విజయ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో జెర్సీ సినిమాలోని నాని హ్యాపీ మూమెంట్ ని షేర్ చేసుకున్నాడు. నాని జెర్సీ సినిమాలో రైలు వచ్చే ముందు..తనలోని ఫీలింగ్ ని గట్టిగా తన గొంతుతో అరిచి ఎలా అయితే చూపిస్తాడో..అచ్చం అలాగే హ్యాపీనెస్ ను పంచుకున్నాడు విజయ్.

ఇంతకీ అతను అంత హ్యాపీగా ఫీలైంది దేనికి అంటే..మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విశ్వంభర (Viswambhara) సినిమాలో కొరియోగ్రాఫర్గా ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి డ్యాన్స్ కంపోజ్ చేశాను..డ్రీం క‌మ్ ట్రూ అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. విజయ్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఇంతవరకు మెగాస్టార్ సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసే అవకాశం అందుకోలేదు. 

ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సాంగ్ షూట్ చిరంజీవి, త్రిషల మధ్య కొరియోగ్రఫీ చేశారు. ప్రతి కొరియోగ్రాఫర్ కూడా ఒక్కసారైనా మెగాస్టార్ చిరంజీవికి డాన్స్ కంపోజ్ చేయాలని అనుకుంటాడు. ఇక తాజాగా ఆ అదృష్టం దక్కడంతో పట్టుకోలేనంత ఆనందాన్ని తనదైన శైలిలో పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయ్ బిన్ని డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన సినిమాలు చూసుకుంటే.. నాని తో జెర్సీ,నేను లోకల్ మూవీతో పాటు రామ్ హలో గురు ప్రేమ కోసమే,ఛలో,ప్రేమమ్,అర్జున్ సురవరం,డిస్కో రాజా,కృష్ణ బృందా విహారి,రంగబలి,మామ మశ్చేంద్ర,హనుమాన్,నా సామిరంగ వంటి సహా అనేక సినిమాల్లో డాన్స్తో సంబంధం లేకుండా..కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా, క్రియేటివ్గా తాను పాటలు కొరియోగ్రాఫీ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు.