ఫ్యామిలీ స్టార్గా విజయ్ దేవరకొండ.. సమ్మర్కి వచ్చేస్తున్నాడు

ఫ్యామిలీ స్టార్గా విజయ్ దేవరకొండ.. సమ్మర్కి వచ్చేస్తున్నాడు

గతేడాది ఖుషి(Khusi) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)..  ఈ ఏడాది సమ్మర్‌‌‌‌‌‌‌‌లో ఫ్యామిలీ స్టార్‌‌‌‌‌‌‌‌(Family Star)గా రాబోతున్నాడు.  పరశురామ్(Parasuram) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌‌‌‌ను శుక్రవారం ప్రకటించారు. సమ్మర్ కానుకగా  ఏప్రిల్ 5న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా  ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాస్ లుక్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ లుంగీ, టీ షర్ట్‌‌‌‌తో  భుజంపై గోనె సంచి వేసుకుని, నోట్లో ఆధార్ కార్డుతో పరుగెత్తుతూ కనిపిస్తున్న పోస్టర్ మాసీవ్‌‌‌‌గా ఉంది.

ఈ లుక్‌‌‌‌ను చూస్తుంటే.. ఇందులో విజయ్ దేవరకొండ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్‌‌‌‌లా ఆకట్టుకునేలా  కనిపిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వాసు వర్మ  క్రియేటివ్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా  వ్యవహరిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.  ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ టీజర్‌‌‌‌‌‌‌‌కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది.  ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి.