సంక్రాంతి రేస్ నుండి ఫ్యామిలీ స్టార్ అవుట్.. క్లారిటీ ఇచ్చేసిన దిల్ రాజు

సంక్రాంతి రేస్ నుండి ఫ్యామిలీ స్టార్ అవుట్.. క్లారిటీ ఇచ్చేసిన దిల్ రాజు

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్(Family Star). సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో ఇప్పటికే గీతగోవిందం సినిమా వచ్చి సూపర్ హిట్ ఐన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యామిలీ స్టార్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల రిలీజైన టీజర్ తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ టీజర్ లో ఐరనే వంచాలా ఏంటి? అని విజయ్ చెప్పిన డైలాగ్ ఎంత ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే డైలాగ్ దర్శనమిచ్చింది. దీంతో సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు, విజయ్ దేవరకొండ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

అయితే..  ఫ్యామిలీ స్టార్ సినిమాను ముందు నుండి 2024 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేశారు మేకర్స్. ఆడియన్స్ కూడా అది ఫిక్స్ అనుకున్నారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఫ్యామిలీ స్టార్ మూవీ సంక్రాంతి నుండి ఔట్ అయినట్టు తెలుస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని చిత్ర నిర్మాత దిల్ రాజు క్లారిఫై చేశారు. ఇదే విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. మా సంస్థ నుండి సంక్రాంతికి వస్తున్న సైంధవ్, గుంటూరు కారం రెండు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అంతేకాదు ఫ్యామిలీ స్టార్ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నాం. కారణం షూట్ చేయాల్సింది ఉంది. అమెరికా షెడ్యూల్ ఇంకా పెండింగ్ లో ఉంది. దానికి ఇంకా 15 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అందుకే ఫ్యామిలీ స్టార్ సినిమాను మార్చ్ కు వాయిదా వేయాల్సి వస్తుంది.. అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు.