విజయ్ దేవరకొండ కొత్తమూవీ పేరు ఫ్యామిలీ స్టార్

విజయ్ దేవరకొండ కొత్తమూవీ పేరు ఫ్యామిలీ స్టార్

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం టైటిల్‌‌ను బుధవారం అనౌన్స్ చేశారు. ‘ఫ్యామిలీ స్టార్‌‌‌‌’ అనే టైటిల్‌‌ను ఫిక్స్ చేస్తూ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్‌‌గా.. బయట రౌడీల బెండు తీసే పవర్ ఫుల్ మ్యాన్‌‌గా ఇందులో కనిపించాడు విజయ్.

యాక్షన్‌‌ సీన్‌‌తో కట్ చేసిన ఈ గ్లింప్స్‌‌ చివర్లో భార్యాభర్తలుగా విజయ్, మృణాల్ ఠాకూర్‌‌‌‌ మధ్య ఎమోషనల్ బాండింగ్‌‌ను చూపించారు. ఇదొక కూల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌ అనే ఫీల్ కలిగించారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సంక్రాంతికి విడుదల కానుంది.