విజయ్ కొత్త షెడ్యూల్.. మార్చి నుంచి మొదలు

 విజయ్ కొత్త షెడ్యూల్.. మార్చి నుంచి మొదలు

 డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకుంటూ యూత్‌‌‌‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తున్నాడు. సమ్మర్ స్పెషల్‌‌‌‌గా ఏప్రిల్ 5న ఈ మూవీ విడుదలవుతోంది. ఇందులో విజయ్ కంప్లీట్ ఫ్యామిలీమ్యాన్‌‌‌‌లా  కనిపించనున్నాడు. మరోవైపు తన నెక్స్ట్ మూవీ  కోసం గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌లా రెడీ అవుతున్నాడు. 

గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌లో విజయ్ తర్వాతి సినిమా ఆల్రెడీ మొదలైన సంగతి తెలిసిందే.  ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంతో బిజీగా ఉన్న విజయ్..  మార్చి నుంచి గౌతమ్ మూవీ కోసం డేట్స్ కేటాయించాడట. మార్చి సెకండ్ వీక్‌‌‌‌ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. శ్రీలీల హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని  సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై సూర్యదేవర నాగవంశీ  నిర్మిస్తున్నారు. ఇదొక గ్యాంగ్‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌ డ్రామాగా తెరకెక్కుతోందని, ఇందులో విజయ్ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి  అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.