విజయ్ దేవరకొండ కొత్త మూవీ .. మార్చి నుంచి మొదలు

విజయ్ దేవరకొండ కొత్త మూవీ .. మార్చి నుంచి మొదలు

డిఫరెంట్ కథలు సెలెక్ట్ చేసుకుంటూ యూత్‌‌‌‌‌‌‌‌లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి త్వరలోనే ప్యాకప్ చెప్పబోతున్నాడు విజయ్. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్టుపై చర్చ జరుగుతోంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌‌‌‌‌‌‌‌లో విజయ్ తర్వాతి సినిమా ఆల్రెడీ మొదలైంది. 

కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అనుకోని కారణాలతో షూటింగ్‌‌‌‌‌‌‌‌కు బ్రేక్‌‌‌‌‌‌‌‌ పడింది. ఆ టైమ్‌‌‌‌‌‌‌‌లోనే ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న శ్రీలీల  కూడా ఈ  సినిమా నుంచి తప్పుకుందని ప్రచారం జరి గింది. దీంతో అసలీ  ప్రాజెక్టు ఉంటుం దా ఉండదా, అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ రూమర్స్‌‌‌‌‌‌‌‌ అన్నింటికీ చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టేలా త్వరలోనే తిరిగి షూటింగ్ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేయబోతున్నారట. 

మార్చి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌‌‌‌‌‌‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌ మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రామా అని ఓ ఇంటర్వ్యూలో విజయ్ చెప్పాడు. ఇందులో తను పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించ నున్నాడట. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.