హైదరాబాద్: ట్యాంక్ బండ్ దగ్గర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ సంబరాల్లో విజయ దేవరకొండ, అతని భార్య రష్మిక మందన్న సందడి చేశారు. ఈ సందర్భంగా.. విజయ్ దేవరకొండ అందరికీ దసరా, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పాడు.
బతుకమ్మను చూస్తే చాలా ముద్దుగా అనిపిస్తుందని, ఇంట్లో వాళ్లు బతుకమ్మను చేస్తుంటారని విజయ్ గుర్తుచేసుకున్నాడు. మన పండుగలు ఇంత జోరుగా జరిపిస్తుంటే సంతోషంగా అనిపిస్తుందని విజయ్ హర్షం వ్యక్తం చేశాడు.
తనకు తొందరగా రష్మిక బతుకమ్మను ఆడుతుంటే చూడాలని ఉందని చెప్పాడు. పెళ్లి తర్వాత రష్మికతో కలిసి తెలంగాణలో జరిగే అతిపెద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని ముందే అనుకున్నానని, అనుకున్నట్టు గానే తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని విజయ్ సంతోషం వ్యక్తం చేశాడు. అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ దసరా, సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పాడు.
