రౌడీ బ్రాండ్ రీ లాంచ్

రౌడీ బ్రాండ్ రీ లాంచ్

ఓవైపు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ.. మరోవైపు నిర్మాతగానే కాక క్లాత్ బ్రాండింగ్, థియేటర్స్‌‌ బిజినెస్‌‌లోనూ రాణిస్తున్నాడు. అలాగే ఇటీవల వాలీబాల్ టీమ్‌‌లోనూ ఇన్వెస్ట్ చేశాడు.  ఫ్యాషన్ పట్ల తనకున్న ఇష్టాన్ని తన సొంత బ్రాండింగ్ రౌడీ క్లాత్ ద్వారా చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండింగ్ ఇప్పటికే యూత్‌‌లో బాగా క్రేజ్ తెచ్చుకుంది. 

తాజాగా  రౌడీ ఇండియన్ స్ట్రీట్ కల్చర్ పేరుతో దీన్ని డిసెంబర్‌‌‌‌లో రీ లాంచ్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇదిలా ఉంటే..ప్రస్తుతం  పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.  ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం  అందిస్తున్నాడు. 

విజయ్ కెరీర్‌‌‌‌లో ఇది 13వ చిత్రం. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్, పరశురాం కాంబినేషన్‌‌లో వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.