ప్రేమకథ..ట్రైలర్‌‌‌‌ విడుదల

ప్రేమకథ..ట్రైలర్‌‌‌‌ విడుదల

కేఎస్‌‌డి కిషోర్, దియా సితెపల్లి జంటగా శివశక్తి రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమకథ’. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. మంగళవారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌‌మీట్‌‌లో హీరోయిన్ దియా మాట్లాడుతూ ‘తెలుగులో ఇదే నా మొదటి చిత్రం.

టీమ్ అంతా కష్టపడి పనిచేశాం. రెగ్యులర్ లవ్ స్టోరీస్‌‌కు మా సినిమా భిన్నంగా ఉంటుంది’ అని చెప్పింది. ‘దాదాపు అంతా కొత్త వాళ్లతో ఒక జెన్యూన్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తీశాం. ప్రమోషన్స్‌‌కు సపోర్ట్ చేసి ఫస్ట్ లుక్, సాంగ్స్ రిలీజ్ చేసిన హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్స్ హరీష్ శంకర్, హనురాఘవపూడి, మారుతి గారికి థ్యాంక్స్’ అని దర్శకనిర్మాతలు అన్నారు. నటులు రాజ్ తిరందాసు, వినయ్ మహాదేవ్, విక్రమ్, డీవోపీ వాసు పెండెం తదితరులు పాల్గొన్నారు.