రష్మికకు విజయ్ వెరైటీ విషెస్ : హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ లిల్లీ

రష్మికకు విజయ్ వెరైటీ విషెస్ : హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ లిల్లీ

గీత గోవిందం సినిమాలో తమదైన స్టైల్లో ఆకటుకున్న జంట విజయ్ దేవరకొండ, రష్మిక. ఈ జోడీని ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం విజయ్, రష్మిక డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుండగా..ఇటీవల రిలీజైన టీజర్ లో మరోసారి ఆకట్టుకుంది ఈ జోడి. నాలుగు భాష‌ల‌లో విడుద‌లైన ఈ టీజ‌ర్ ఫైటింగ్ స‌న్నివేశంతో మొద‌లు కాగా, లిప్ లాక్ సీన్‌ తో ఎండ్ చేశారు. టీజ‌ర్‌ని స్పూఫ్ చేసి కాస్త డిఫ‌రెంట్‌ గా రూపొందించారు నెటిజ‌న్స్‌. శుక్రవారం రష్మిక బర్త్ డే. ఈ సందర్భంగా కాస్త వెరైటీగీ మంధానకు విషెస్ చేయాలనుకున్నాడు విజయ్. నెటిజన్స్ స్పూస్ చేసిన వీడియోను షేర్ చేస్తూ.. హ్యాపీ బ‌ర్త్ డే డియ‌ర్ లిల్లీ అని ర‌ష్మిక‌కి బ‌ర్త్ డే విషెస్ తెలిపాడు విజ‌య్ దేవ‌ర‌కొండ. అంటే డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో ర‌ష్మిక పాత్ర పేరు లిల్లీ అని తెలుస్తుంది.

భరత్ కమ్మ డైరెక్షన్ లో డియ‌ర్ కామ్రేడ్ రూపొందుతుండ‌గా, ఇందులో కాకినాడ యాస‌లో మాట్లాడి అల‌రించ‌నున్నాడు విజ‌య్‌. స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ న‌టిస్తుండ‌గా .. ఉమెన్ క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. టీమిండియా ఉమెన్స్ క్రికెట్ లో స్మృతి మందన ఉండగా..ఇప్పుడు సినిమాలో క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనున్నదన్నమాట.