Vijay Rashmika: శ్రీవారి సన్నిధిలో విజయ్ దేవరకొండ, రష్మిక.. ‘రణబాలి’ సక్సెస్ కోసం ప్రత్యేక పూజలు

Vijay Rashmika: శ్రీవారి సన్నిధిలో విజయ్ దేవరకొండ, రష్మిక.. ‘రణబాలి’ సక్సెస్ కోసం ప్రత్యేక పూజలు

టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తిరుమలలో సందడి చేశారు. తమ లేటెస్ట్ మూవీ ‘రణబాలి’ (Ranabaali) విడుదలకు ముందు ఈ స్టార్ జంట తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవాళ మంగళవారం (అక్టోబర్ 13, 2026న) వేకువజామున ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా తమ ‘రణబాలి’ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శ్రీవారిని ప్రార్థించారు.

సినిమా రిలీజ్‌కు ముందు దైవదర్శనం..

ప్రస్తుతం టాలీవుడ్‌లో ‘రణబాలి’ సినిమా హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్‌ సాంకృత్యాన్‌ తెరకెక్కించిన ‘రణబాలి’ (RANABAALI) ఈ శుక్రవారం (అక్టోబర్ 16న) ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే విరోష్ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అభిమానుల్లోనూ ఆసక్తిని పెంచింది. సంప్రదాయబద్ధంగా స్వామివారి సేవలో పాల్గొన్న ఈ జంటకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఆడియన్స్ని ఆకర్షిస్తున్నాయి.

బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో విజయ్, రష్మిక

ఓవైపు తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతుండగా, మరోవైపు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రాకతో ఆలయ పరిసరాల్లో సినీ సందడి నెలకొంది. తమ అభిమాన సినీ స్టార్స్ స్వామివారి సేవలో పాల్గొనడం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కరవు చరిత్రే ‘రణబాలి’ ..

దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ రాయలసీమ కరవు చరిత్రపై లోతుగా పరిశోధన చేశారు. ఈ కరవు ప్రభావం రాయలసీమకే పరిమితం కాకుండా కోస్తాంధ్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మైసూరు వరకు విస్తరించినట్లు తెలుసుకున్నారు. ‘గ్రేట్ సౌత్ ఇండియన్ మద్రాస్ ఫేమిన్‌’ పేర్కొనే ఈ కరువు కారణంగా రెండేళ్లలో సుమారు కోటి మంది మరణించారనే చారిత్రక అంశం కథకు ప్రధాన నేపథ్యంగా నిలిచింది.

పౌరాణిక కథ నుంచి ‘రణబలి’ టైటిల్‌..

తారకాసుర సంహారానికి సంబంధించిన కుమారస్వామి పౌరాణిక గాథ, ‘రణబాలి మురుగన్‌’ ప్రస్తావన ఆధారంగా సినిమా టైటిల్‌ను ఎంపిక చేసినట్లు ఇటీవల ట్రైలర్ ఈవెంట్లో దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ వెల్లడించారు.