Family Star: ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ వచ్చేసింది..ఎన్టీఆర్ దేవర లేనట్టే!

Family Star: ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ వచ్చేసింది..ఎన్టీఆర్ దేవర లేనట్టే!

సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో ఒక్కోసారి మేకర్స్ వేసుకున్న ప్లాన్స్ వర్కవుట్ కావు. షూటింగ్ మొదట్లోనే కొందరు విడుదల తేదీని కూడా ప్రకటించేస్తారు. కానీ ఏవో కారణాల వలన  అప్పటి పరిస్థితులకు రిలీజ్ అయ్యే చాన్స్ ఉండదు. అలాంటి పరి స్థితే ఎన్టీఆర్(Ntr) దేవర (Devara) చిత్రానికి వచ్చినట్టు తెలుస్తోంది. కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కు తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌ను ఏప్రిల్ 5న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

ఇపుడు అదే డేట్కి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ (Family Star) వస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్5న థియేటర్లలో ఫ్యామిలీ స్టార్ సందడి చేయనుందని మేకర్స్ వెల్లడించారు. చాలా రోజుల నుంచి ఈ సినిమా రిలీజ్ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాను సోలో రిలీజ్ డేట్ కోసం..మేకర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే, లేటెస్ట్గా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ప్రకారం చూస్తే..ఎన్టీఆర్ దేవర ఇప్పట్లో లేనట్టు తెలుస్తోంది.

సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్గా నటిస్తున్నఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC54) పై దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 20 నాటికి షూటింగ్‌ పూర్తి చేసి, ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తున్నారు. గోపీ సుందర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

దేవర విషయానికి వస్తే..ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ..కొంత వీఎఫ్‌‌ఎక్స్‌‌ వర్క్స్తో పాటు విలన్ రోల్ చేస్తున్న సైఫ్ అలీఖాన్‌‌ కు ఇటీవలే గాయాలవడంతో తన పోర్షన్ షూటింగ్ బ్యా లెన్స్ ఉండటంతో మరో మూడు నెలలు రిలీజ్‌‌ను వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది.