Family Star Teaser: ఇంప్రెసివ్‌గా ఫ్యామిలీ స్టార్..ఏవండి కాలేజ్‍కు వెళ్లాలి..కొంచెం దించేస్తారా

Family Star Teaser: ఇంప్రెసివ్‌గా ఫ్యామిలీ స్టార్..ఏవండి కాలేజ్‍కు వెళ్లాలి..కొంచెం దించేస్తారా

స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (FamilyStar). సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్(Mrunal thakur) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC54) పై దిల్ రాజు(Dil raju) నిర్మిస్తున్నారు. 

లేటెస్ట్ గా ఫ్యామిలీ స్టార్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీలో విజయ్ లుక్, తెలంగాణ స్లాంగ్లో వచ్చే డైలాగ్స్ ఎంతో అట్రాక్షన్ గా ఉన్నాయి. మధ్య తరగతి కుర్రాడిలా..పక్కింటి అబ్బాయిలా ఆకట్టుకుంటున్నాడు. 

“దేఖోరే.. దేఖోరే.. దేఖోరే దేఖో.. కలియుగ రాముడు వచ్చిండు కాకో” అంటూ ర్యాప్ సాంగ్‍తో ఫ్యామిలీ స్టార్ టీజర్ అదిరిపోయింది. “ఏవండి..కాలేజ్‍కు వెళ్లాలి..కొంచెం దించేస్తారా” అని మృణాల్ ఠాకూర్ అంటే..'ఓ లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా' అని విజయ్ అనడంతో టీజర్ పై ఆడియన్స్ లో ఆసక్తి పెంచేసింది.

రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్  గ్లింప్స్ లో..ఉల్లిపాయలు కొంటె ఆడు మనిషి కాదా..పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా..అనే డైలాగ్స్ అయితే..థియేటర్లో విజిల్స్ పడేలా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్..అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను, ఓ వైపు కుర్రాళ్లను భలే ఆకట్టుకుంది. 

పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతగోవిందం సినిమా వచ్చి సూపర్ హిట్ ఐన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరో పదేళ్లు తమ ఫ్యాన్స్ మాట్లాడుకునేలా ఫ్యామిలీ స్టార్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.

అంతేకాదు ఈ సినిమాతో విజయ్ హిట్ కొడితేనే..సినిమా కెరీర్ కు ప్రాణం పోసినంత హెల్ప్ అవుతుంది. మరి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి మరి. ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.