
టాలీవుడ్ట్రెండింగ్జంట విజయ్ దేవరకొండ( Vijay Deverakonda), రష్మిక (RashmikaMandanna) మధ్య రిలేషన్ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే వీరిద్దరి మధ్య వచ్చే రూమర్లు, ఇప్పుడు కొత్తగా వచ్చేవి కాదు. గీత గోవిందం మూవీ నుంచే మొదలయ్యాయి. ఈ సినిమాలో ఇద్దరూ జంటగా నటించారు.
గీత గోవిందం మూవీలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అప్పటి నుంచే వీళ్లిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఎప్పటికప్పుడు వాళ్లిద్దరూ ఖండిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా..వీళ్ళిద్దరూ ఏదో ఒకచోట కలిసి కనిపిస్తూ ఉండడం, పండుగల సమయంలో రష్మిక.. విజయ్ దేవరకొండ ఇంట్లో ఉండడం, ఓకే ప్లేస్ కి వెకేషన్ కి వెళ్లడం..ఇవన్నీ వీరి రిలేషన్ లో ఉన్నట్లు చూపిస్తున్నాయి.
ఇపుడు త్వరలో రష్మిక..విజయ్ ఎంగేజ్మెంట్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. దీంతో విజయ్ దేవరకొండ ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ.." నా మ్యారేజ్,ఎంగేజ్మెంట్ గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. నాకు రెండేళ్లకోసారి పెళ్లి చేయాలని మీడియాతో పాటు పలు సోషల్ మీడియా వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే ఇలాంటి కథనాలు నెలకోసారి బయటికి వస్తున్నాయి. ఈ రూమర్స్ తరుచు వింటూ నాకు అలవాటైపోయాయి. వాళ్లు స్వయంగా నన్ను పెళ్లి చేసుకోమని ఇలాంటి కథనాల క్రియేట్ చేస్తూ బలవంతం చేస్తున్నారు" అంటూ విజయ్ చెప్పుచ్చాడు.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి నిజంగా ఈ జంట లివింగ్ రిలేషన్ లో ఉన్నారో లేదో తెలియదు..అయినప్పటికీ నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్లో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలో నటిస్తున్నారు.