టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ రోజు ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడలో విజయ్ మూడు మూళ్లు వేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా బంధువులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది.
విజయ్, రష్మికల వివాహం అత్యంత వైభవంగా, రెండు వేర్వేరు సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఉదయం 10:10 గంటలకు ఉదయ్‌పూర్‌లోని ప్రసిద్ధ ITC మెమెంటోస్ హోటల్‌లో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఉదయం వేళ విజయ్ దేవరకొండ ఇంటి ఆచారం ప్రకారం తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. సాయంత్రం రష్మిక పుట్టిన గడ్డ అయిన కూర్గ్ (కొడవ) సంప్రదాయం ప్రకారం మరో వివాహ వేడుకను నిర్వహించారు.
పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను విజయ్, రష్మిక తమ అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'హాయ్ మై లవ్స్.. నాభర్తను మీకు పరిచయం చేస్తున్నా.. మిస్టర్ విజయ్ దేవరకొండ' అని పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్అవుతున్నాయి.
రష్మిక ఎమోషనల్ పోస్ట్..
రష్మిక తన భర్తగా విజయ్ ను పరిచయం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నా భర్తను మీకు పరిచయం చేస్తున్నాను! మిస్టర్ విజయ్ దేవరకొండ!! . నిజమైన ప్రేమ అంటే ఏంటో నాకు తెలిసేలా చేసిన వ్యక్తి.. నా మనసుకి ప్రశాంతతను పరిచయం చేసిన మనిషి! పెద్ద కలలు కనడం తప్పు కాదని, నా ఊహకు అందని విజయాలను కూడా నేను సాధించగలనని ప్రతిరోజూ నాకు నమ్మకాన్ని ఇచ్చారు! స్నేహితులతో ప్రయాణాలు చేయడం ఎంత బాగుంటుందో చూపించారు. నిజం చెప్పాలంటే, ఈయన గురించి నేను ఒక పుస్తకమే రాయగలను!
నేను ఎప్పుడూ ఏలాంటి స్త్రీగా ఉండాలని కలలు కన్నానో.. ఈరోజు అలా ఉన్నానంటే దానికి కారణం మీరే! నాకు దక్కిన గొప్ప వరం మీరు! విజ్జూ.. నీపై నాకున్న ప్రేమని చెప్పడానికి మాటలు ఎప్పుడూ సరిపోవు.. ఇది నీకు ఎప్పుడూ చెప్తూనే ఉంటాను!! కానీ ఈరోజు నా కష్టాలు, సుఖాలు, విజయాలు, బాధలు.. నా జీవితం వీటన్నింటికీ ఒక అర్థం దొరికిందంటే అది నువ్వు నా పక్కన ఉన్నందువల్లే. వీటన్నింటిలోనూ నువ్వే అతిపెద్ద భాగం! నీ భార్యగా మారబోతున్నందుకు.. నీ భార్య అని పిలిపించుకోబోతున్నందుకు నేను చాలా చాలా ఉత్సాహంగా ఉన్నాను! ఇక సెలబ్రేషన్స్ మొదలు!! మనం కలిసి ఒక అద్భుతమైన జీవితాన్ని గడుపుదాం! ఐ లవ్ యు! అంటూ రష్మిక పోస్ట్ చేసింది.
అటు విజయ్ దేవర కొండ కూడా తన అర్ధాంగి రష్మికను అభిమానులకు పరిచియం చేస్తూ పోస్ట్ చేశారు. ఒకరోజు తను లేని లోటు నాకు బలంగా తెలిసొచ్చింది. తను పక్కన ఉంటే నా రోజంతా ఇంకా బాగుండేది అనిపించింది. మేమిద్దరం కలిసి భోజనం చేస్తుంటే ఆ ముద్ద ఇంకా రుచిగా, తృప్తిగా ఉండేది అనిపించింది. వర్కవుట్స్ చేస్తున్నప్పుడు తను తోడుంటే సరదాగా అనిపించేది. నేను ఎక్కడున్నా, ఆ ఇంటి అనుభూతిని, ప్రశాంతతను పొందడానికి నాకు తను కావాలని అర్థమైంది. అందుకే... నా బెస్ట్ ఫ్రెండ్‌ని... నా భార్యగా రష్మికను చేసుకున్నాను అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అర్ధాంగి
