టాప్ హీరో హీరోయిన్స్.. విజయ్ దేవరకొండ, రష్మిక ఒక్కటి అయ్యారు. పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. ఉదయ్ పూర్ కోటలో ధూంధాంగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీడియాకు నో ఎంట్రీ.. జస్ట్ లీక్స్ మాత్రమే.. ప్రధాని మోడీ నుంచి సినీ, రాజకీయ ప్రముఖలు అందరూ విషెస్ చెబుతున్నారు.. విరోష్ వెడ్డింగ్ లైవ్ అప్ డేట్స్ మీ కోసం....
- అతిథులకు స్పెషల్ గిఫ్ట్లు ఇచ్చిన విరోష్ జంట
- పెళ్లికి వచ్చిన అతిథులకు మనసును తాకే ఆతిథ్యం ఏర్పాటు
- ప్రతీ గెస్ట్ రూమ్ లో స్పెషల్ స్నాక్ బాస్కెట్
- బాస్కెట్లో రష్మిక, విజయ్ నచ్చిన, మెచ్చిన సెలెక్టెడ్ ఫుడ్, ఇతర ఐటెమ్స్
- పెట్ డాగ్స్ పోస్టర్స్ ను వైరల్ చేస్తున్న అభిమానులు
- విజయ్ దేవరకొండ పెడ్ డాగ్ సైబీరియన్ హస్కీ పేరు ..స్టార్మ్ దేవరకొండ
- రష్మిక పెంపుడు కుక్క కాకర్ స్పానియెల్ పేరు.. ఆరా
- సంగీత్ వేడుకలో డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన రష్మిక మందన్న
- కాబోయే భర్త విజయ్ దేవరకొండ కోసం 'పుష్ప 2' చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్
- 'వీడు మొరటోడు' పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించిన రష్మిక
- సంగీత్ వేడుకల్లో ఎమోషనల్ అయిన విజయ్ దేవరకొండ తల్లి
- రష్మికను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ఆశీర్వదించిన మధవీ దేవరకొండ
- మై డార్లింగ్ రుషీ.. అంటూ భావోద్వేగం
- విజయ్ దేవరకొండ రష్మికల హల్దీ ఫంక్షన్ లో అశికా రంగనాథ్ సందడి..
- ఇంస్టాగ్రామ్ లో హల్దీ ఫంక్షన్ ఫోటోలు షేర్ చేసిన అశికా
#AshikaRanganath ??#Viro pic.twitter.com/eKkHKw7nLY
— ONE LIFE ONE CHANCE? (@TheRowdyBoi) February 25, 2026
- హల్దీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక ,
Haldi? #ViRosh ?#VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/0xPXjSZobw
— THE RWDY?X (@TheDEVERA_fan) February 25, 2026
- విజయ్ రష్మిక వివాహ వేడుకకు హాజరైన గర్ల్ ఫ్రెండ్ దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్.
- కొడవ పెళ్లి సంప్రదాయంలో మాంగళ్యధారణ ఉండదని తెలుస్తోంది. అలాగే, పూజారులకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఉండదు. పూర్వీకుల ఆశీర్వాదాల ఆధారంగానే ఈ వివాహం జరుగుతుంది. కొడవ పెళ్లిలో ఒడి బియ్యం స్థానంలో వధువు కాయిన్స్ మూట పట్టుకొస్తుంది. ఈ మ్యారేజ్లో పెళ్లి కూతురు తల్లికే ఎక్కువ ప్రాధాన్యత.
- విరోష్ సంగీత్ వేడుక కోసం వేదికను ప్రకాశవంతమైన దీపాలు, రంగు రంగుల పూలతో ఎంతో అందంగా అలంకరించారు. 7 ఏళ్ల తమ ప్రేమ ప్రయాణంలో ఈ జంట తీసుకున్న ఎన్నో అందమైన, రొమాంటిక్ ఫొటోలను వేదిక అంతటా ప్రదర్శించారు. ఈ ఆన్ సీన్ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయి.
We need those original pictures @iamRashmika please ?❤️❤️#ViRosh pic.twitter.com/uVx2O2gWLz
— Rahul (@The_pathbreaker) February 24, 2026
- విరోష్ వేడుకకు సంబంధించిన హల్దీ, సంగీత్ సెలబ్రేషన్స్ ఫొటోలు, వీడియోలు బయటకొచ్చాయి. ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ తన ఇంస్టాగ్రామ్ లో ఫొటోను పోస్ట్ చేసింది. అందులో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా తదితరులు ఉత్సాహంగా కనిపించారు.
- విరోష్ వేడుకకు ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, ‘ఖుషి’ డైరెక్టర్ శివ నిర్వాణ, హీరోయిన్లు ఈషా రెబ్బా, ఆషికా రంగనాథ్, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ హాజరుయ్యారు.
- విజయ్-రష్మికల వివాహ వేడుకలు మెహందీతో మంగళవారం (ఫిబ్రవరి 24) ప్రారంభమయ్యాయి. బుధవారం (ఫిబ్రబరి 25న) హల్దీ, సంగీత్ కార్యక్రమాలు సందడిగా జరుగుతున్నాయి.
- రష్మిక మందన్న నుంచి ‘కాక్‌టెయిల్ 2’, ‘మైసా’, ‘రణబాలి’ మరియు ‘యానిమల్ పార్క్’ వంటి భారీ సినిమాలు రానున్నాయి.
- విజయ్ దేవరకొండ నుంచి ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ వంటి రెండు భారీ పీరియాడిక్ చిత్రాలు రానున్నాయి.
- తెలుగు సంప్రదాయంలో విజయ్, రష్మికల వివాహ ముహూర్తం ఉదయం 8 గంటలకు ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది.
- రష్మిక బెంగళూరులోని రామయ్య కళాశాలలో చదువుకుంది. విజయ్ హైదరాబాద్‌లోని బద్రుకా కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పొందాడు.
- విజయ్, రష్మికల వివాహం రెండు వేర్వేరు సంప్రదాయాల్లో జరగనుంది. ఉదయం తెలుగు పద్ధతిలో విజయ్ ఇంటి ఆచారం ప్రకారం, సాయంత్రం రష్మిక కుటుంబానికి చెందిన 'కొడవ' సంప్రదాయ పద్ధతిలో వేడుకలు జరగనున్నాయి.
- విజయ్ దేవరకొండకు 30 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ విమానం ఉందని సమాచారం.
- విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరి ఆస్తులు కలిపి రూ.130 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో విజయ్ ఆస్తుల విలువ 66 నుంచి 70 కోట్ల రూపాయల వరకు ఉంది. రష్మిక ఆస్తుల విలువ 60 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది ఇంటర్నెట్ లో ఉన్న సమాచారం.
- విజయ్–రష్మికల మధ్య ఏజ్ గ్యాప్ 7 ఏళ్లు. రష్మిక ఏప్రిల్ 5, 1996న కర్ణాటకలోని విరాజ్‌పేటలో జన్మించగా, ప్రస్తుతం ఆమె వయస్సు 29 సంవత్సరాలు. విజయ్ దేవరకొండ మే 9, 1989న హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన వయస్సు 36 సంవత్సరాలు.
- మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పెళ్లికి హాజరయ్యారు. 2017లో విజయ్ తో అర్జున్ రెడ్డి మూవీ చేయగా.. ఆ తర్వాత 2023లో యానిమల్ మూవీలో రష్మిక నటించింది. వీళ్లిద్దరితో సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన రెండు మూవీలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
- విజయ్ దేవరకొండ తల్లి తమ కుటుంబ వారసత్వంగా వచ్చిన గాజులను రష్మిక మందన్నకు బహుమతిగా ఇచ్చింది.
- ఉదయ్ పూర్ కోటలో గ్రాండ్ గా జరుగుతున్న పెళ్లి వేడుకకు చేరుకున్న పూజారులు. హైదరాబాద్ నుంచి నలుగురు పూజారులు హాజరు. సంప్రదాయ పద్దతిలో పెళ్లి జరిపించనున్న పండితులు.
- భారత ప్రధాని నరేంద్ర మోడీ కాబోయే నూతన వధూవరులకు (విజయ్, రష్మికలకు) శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు పంపిన వివాహ ఆహ్వానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందిస్తూ స్పెషల్ నోట్ ద్వారా విషెస్ అందించారు. ఈ వివాహం వారి జీవితాల్లో “అందమైన కొత్త అధ్యాయం” ప్రారంభమవుతుందన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంలో భాగంగా ఏడడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా మారుతున్న ఈ క్షణం ఎంతో విశిష్టమని పేర్కొన్నారు.
ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ‘Virosh Premier League’ (VPL) పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక షేర్ చేసింది. ఫోటోలో క్రికెట్ గ్రౌండ్ మార్కింగ్ కనిపిస్తుండగా, విజయ్ అదే పేరుతో ఉన్న 'పాప్‌కార్న్ బకెట్' ఫోటోను షేర్ చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
