Vijay Deverakonda: బాలీవుడ్‌పై కన్నేసిన విజయ్ దేవరకొండ.. విక్రమ్ కుమార్ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ ఫిక్స్?

Vijay Deverakonda: బాలీవుడ్‌పై కన్నేసిన విజయ్ దేవరకొండ.. విక్రమ్ కుమార్ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్ ఫిక్స్?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ జోరులో ఉన్నారు. 'అర్జున్ రెడ్డి' మూవీతో ఓవర్ నైట్ స్టార్ డమ్ ను సొంతం చేసుకున్న  విజయ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా.. ‘లైగర్’ లాంటి సినిమాలు నిరాశపరిచినా రౌడీ క్రేజ్ రవ్వంతైనా తగ్గలేదు. ప్రస్తుతం 'రణబాలి', 'రౌడీ జనార్దన్' లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నారు.  ఎలాగైనా సరే గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలన్న  కసితో విజయ్  వర్క్ చేస్తున్నారు. అయితే, సరిగ్గా ఇక్కడే ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది.

విక్రమ్ కుమార్ మ్యాజిక్‌తో 

లేటెస్ట్ గా ముంబైలోని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ‘మ్యాడ్ డాక్ ఫిల్మ్స్’ (Maddock Films) ఆఫీస్ బయట విజయ్ దేవరకొండ ప్రత్యక్షమవడం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘స్త్రీ’ సిరీస్, ‘ముంజ్యా’, ‘ఛావా’, ‘థామా’ వంటి హారర్-కామెడీ, హిస్టారికల్ చిత్రాలతో ప్రస్తుతం బాలీవుడ్‌ను శాసిస్తోంది ఈ సంస్థ. అయితే ఈ మీటింగ్‌లో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. విజయ్ పక్కన 'మనం', '24', 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కూడా ఉన్నాడు.

టాలీవుడ్ టూ బాలీవుడ్

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. విక్రమ్ కుమార్ చెప్పిన ఒక మైండ్ బ్లోయింగ్ పాన్ ఇండియా స్క్రిప్ట్ విజయ్‌కి విపరీతంగా నచ్చింది. నిజానికి, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ 'యూవీ క్రియేషన్స్' భారీ బడ్జెట్‌తో నిర్మించాల్సింది. కానీ, ఉన్నట్టుండి ఈ ప్రాజెక్ట్ నుండి యూవీ క్రియేషన్స్ తప్పుకుందనే వార్త టాలీవుడ్‌లో ప్రకంపనలకు దారితీసింది.  బడ్జెట్ కేటాయింపులు, క్రియేటివ్ డిఫరెన్సెస్  కారణంగానే యూవీ క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని గట్టిగా వినిపిస్తోంది. ఒక భారీ ప్రాజెక్ట్ ఇలా సెట్స్ పైకి వెళ్లకుండానే వెనక్కి తగ్గడం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

హిందీ మార్కెట్‌పై రౌడీ గురి..
తెలుగులో వివాదం నడుస్తుండగానే.. రౌడీ స్టార్ ఏమాత్రం తగ్గకుండా బాలీవుడ్ కార్పొరేట్ దిగ్గజం మ్యాడ్ డాక్ ఫిల్మ్స్‌ను లైన్లోకి తెచ్చాడు. టాలీవుడ్ బ్యానర్ హ్యాండ్ ఇచ్చినా, బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ బ్యాకింగ్‌తో ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా హిందీ మార్కెట్లో లాంచ్ చేసేందుకు విజయ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

సౌత్ స్టార్స్ అందరూ నార్త్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, విక్రమ్ కుమార్ మార్క్ విభిన్నమైన స్క్రీన్ ప్లే మ్యాజిక్, మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ వంటి సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ తోడైతే విజయ్ దేవరకొండ బాలీవుడ్‌ను రూల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ వివాదాలు, మలుపుల మధ్య ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి ..