RashmikaVija: రష్మికతో ఫస్ట్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన విజయ్ దేవరకొండ!

RashmikaVija: రష్మికతో ఫస్ట్ బర్త్‌డే.. ఫ్యాన్స్‌తో కలిసి కేక్ కట్ చేసిన విజయ్ దేవరకొండ!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మే 9న తన 37వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఏడాది బర్త్‌డే విజయ్‌కు అత్యంత ప్రత్యేకం. ఎందుకంటే, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో పెళ్లయ్యాక ఆయన జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో తెలుగు, కొడవ సంప్రదాయాల ప్రకారం వైభవంగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టంది ఈ క్యూట్ కపుల్.. ఇప్పుడు మొదటిసారి జంటగా ఫ్యాన్స్ ముందుకు వచ్చి  కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు.

బాల్కనీలో 'విరోష్' మెరుపులు..!

ఉదయం నుంచే జూబ్లీహిల్స్‌లోని విజయ్ దేవరకొండ ఇంటి వద్ద ఫ్యాన్స్ కోలాహలం మొదలైంది. వేల సంఖ్యలో తరలివచ్చిన అభిమానుల కోసం విజయ్ తన భార్య రష్మిక, తల్లి మాధవితో కలిసి బాల్కనీలోకి వచ్చారు. సింపుల్ క్రీమ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతున్న రష్మికను, పక్కనే రౌడీ స్టార్‌ను చూసిన అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. "హ్యాపీ బర్త్‌డే అన్న" అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేస్తుంటే, విజయ్ చేతులు ఊపుతూ థాంక్స్ చెప్పారు.

 

ఫ్యాన్స్‌తో రౌడీ హంగామా!

అంతటితో ఆగకుండా, విజయ్ నేరుగా అభిమానుల మధ్యకు వచ్చి సందడి చేశారు. అభిమానులు ఏర్పాటు చేసిన  ఒక భారీ త్రీ-టైర్ కేక్‌ను వారి సమక్షంలో కట్ చేశారు.  ఈ సందర్భంగా విజయ్ చూపించిన వినయం, ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం బర్త్ డేకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

 

ఆనంద్ ఎమోషనల్ పోస్ట్.!

ఇక విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ షేర్ చేసిన బర్త్‌డే విష్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. విజయ్-రష్మిక పెళ్లి హల్దీ వేడుకలకు సంబంధించిన కొన్ని అన్‌సీన్ పిక్స్ షేర్ చేస్తూ.. ఈ ఏడాది నీ బర్త్‌డేను నువ్వు మరింత సంపూర్ణంగా, రెట్టింపు ధైర్యంతో జరుపుకుంటున్నావు. హ్యాపీ బర్త్‌డే బిగ్ బ్రదర్ అంటూ ఆనంద్ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు.

►ALSO READ | Ashu Reddy : కేసుల నుంచి తప్పుకునేందుకే ఈ విన్యాసాలా? అషురెడ్డి ఫేక్ ఎంగేజ్‌మెంట్‌పై నెటిజన్ల ఫైర్!

కెరీర్ పీక్స్‌లో రౌడీ స్టార్!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరీర్ పరంగా కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు.  'రౌడీ జనార్ధన' అనే ఊర మాస్ రూరల్ యాక్షన్ మూవీతో అలరించేందుకు రెడీ అయ్యారు. ఆ తర్వాత తన సతీమణి రష్మిక మందన్నతో కలిసి 'రణబలి' అనే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రాల షూటింగ్ కూడా ప్రారంభమైంది. అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో సరికొత్త ఊపుతో దూసుకెళ్తున్న రౌడీ స్టార్‌ విజయ్ దేవరకొండకు బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.