Vijay Deverakonda : 'బ్లడీ షూర్ ఐ విల్ బి బ్యాక్'.. ట్రోల్స్‌కు విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ కౌంటర్!

Vijay Deverakonda : 'బ్లడీ షూర్ ఐ విల్ బి బ్యాక్'.. ట్రోల్స్‌కు విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ కౌంటర్!

టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ అండ్ మోస్ట్ లవ్‌డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాన్ దర్శకుడు. అక్టోబర్ 16న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు

 బ్లడీ షూర్ ఐ విల్ బి బ్యాక్!

ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తన కెరీర్, ప్లాప్‌లు, కంబ్యాక్ గురించి ఎంతో ఎమోషనల్‌గా స్పందించారు. గతంలో 'నోటా' సరిగ్గా ఆడకపోవడంతో చాలామంది నన్ను ట్రోల్ చేశారు, నా ఫెయిల్యూర్‌ను కొందరు ఎంజాయ్ చేయడం నా ఈగోని హర్ట్ చేసింది. కానీ అప్పుడే 'ఐ విల్ బి బ్యాక్' అని లేఖ రాసి 'టాక్సీవాలా'తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాను అని చెప్పారు.

 మేము అనుకున్నది జరిగి ఈ సినిమా ఘన విజయం సాధిస్తే.. కచ్చితంగా అనంతపూర్ వేదికగా మీ అందరి ముందూ మళ్లీ ఈ విషయాన్ని గుర్తుచేస్తా. నమ్మకం, ప్రాణం పెట్టి పనిచేయడమే మన చేతిలో ఉంటుందని విజయ్ చెప్పారు.  సినిమాలో హాలీవుడ్ లెజెండ్ ఆర్నాల్డ్ లాంటి నటుడిని భాగం చేయడం మైత్రీ సంస్థ బిగ్ విజన్‌కి నిదర్శనమని కొనియాడారు.

'సూపర్ ఎల్ నినో'పై విజయ్ పిలుపు..

150 ఏళ్ల క్రితం బ్రిటిష్ కాలంలో రాయలసీమను వణికించిన 'గ్రేట్ మద్రాస్ కరువు', అప్పట్లో దాదాపు కోటి మంది ఆకలి చావుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం రాబోతున్న 'సూపర్ ఎల్ నినో' ప్రభావంపై విజయ్ స్పందిస్తూ.. నీరు, ఆహారం, విద్యుత్‌ను ఎవరూ వృథా చేయకుండా రాబోయే ఏడాది పాటు ఎంతో బాధ్యతగా ఉండాలని భావోద్వేగంగా పిలుపునిచ్చారు.

జయమ్మ-రణబాలిల పెళ్లి ముచ్చట..

'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' తర్వాత విజయ్-రష్మిక కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. అయితే షూటింగ్ సమయంలో వీరి పెళ్లి విషయం తెలీదని, కానీ నిజ జీవితంలో పెళ్లికి ముందే సినిమాలో వీరి పెళ్లి సీన్ తీసేశామని దర్శకుడు రాహుల్ సరదాగా పంచుకున్నారు. రష్మిక ఎదుగుదల చూస్తే గర్వంగా ఉందన్న విజయ్ కామెంట్స్‌కు, ‘విజయ్ నటన చూస్తుంటే భయమేసింది’ అన్న రష్మిక మాటలు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించాయి. హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ స్థాయి నిర్మాణ విలువలతో, భక్తి నేపథ్యంతో కూడిన డ్రామాతో రాబోతున్న 'రణబాలి' బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.