అన్వేషి .. థ్రిల్ విత్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ : విజయ్ ధరణ్

అన్వేషి .. థ్రిల్ విత్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్  : విజయ్ ధరణ్

విజ‌‌య్ ధ‌‌ర‌‌ణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అన‌‌న్య నాగ‌‌ళ్ల లీడ్ రోల్స్‌‌లో వి.జె.ఖ‌‌న్నా ద‌‌ర్శకత్వంలో టి.గ‌‌ణ‌‌ప‌‌తి రెడ్డి నిర్మించిన చిత్రం ‘అన్వేషి’. శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా విజయ్ ధరణ్ మాట్లాడుతూ ‘ఇదొక లవ్ థ్రిల్లర్. స్టోరీ చాలా ఫ్రెష్‌‌గా ఉంటుంది. వి.జె.ఖన్నా గారు కథ చెప్పినప్పుడే బెస్ట్ ఫిల్మ్ అవుతుందని నమ్మా. డిటిక్టివ్ అవుదామనుకున్న  హీరో.. మారేడుకోన అనే విలేజ్‌‌లో అనుకోని ఘటన జరిగితే  ఎలా సాల్వ్ చేశాడనేది కథ. 

ఆత్మ వలన జరిగిన సంఘటనల ఆధారంగా కథ తిరుగుతుంది.  థ్రిల్లింగ్ అంశాలతో పాటు ఎంటర్‌‌‌‌టైనింగ్‌గా కూడా ఉంటుంది. నాలాంటి అప్ కమింగ్ యాక్టర్‌‌‌‌కి ఇలాంటి రోల్ చేయడం చాలెంజింగ్‌‌గానే ఉంటుంది. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం. అందుకే హిట్ అవ్వకపోతే గుండు కొట్టించుకుంటానని సవాల్ చేశా. అదే మాటపై నిలబడి ఉంటాను. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంది. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ గారు లీడ్‌‌గా నటిస్తున్న చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా’ అని చెప్పాడు.