విజయ్ ‘జన నాయగన్’ గ్లింప్స్‌‌ రిలీజ్.. కత్తితో మీసాన్ని తిప్పడం హైలైట్‌‌

విజయ్ ‘జన నాయగన్’ గ్లింప్స్‌‌ రిలీజ్.. కత్తితో మీసాన్ని తిప్పడం హైలైట్‌‌

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న చివరి  చిత్రం ‘జన నాయగన్’. హెచ్ వినోద్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆదివారం విజయ్ బర్త్‌‌డే సందర్భంగా తన స్పెషల్ పోస్టర్‌‌‌‌తో పాటు ‘ఫస్ట్ రోర్’ పేరుతో ఈ మూవీ గ్లింప్స్‌‌ను రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్‌‌‌‌లో సింహాసనం మీద ఠీవిగా కూర్చుని చేతిలో కత్తి పట్టుకుని ఇంటెన్స్‌‌ లుక్‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు  విజయ్. ఇక ఫస్ట్ రోర్‌‌‌‌లో తనొక పవర్‌‌‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌‌‌గా కనిపించాడు. నిజమైన నాయకుడు అధికారం కోసం కాదు, ప్రజల కోసం వస్తాడు అనే క్యాప్షన్‌‌తో మొదలైన ఈ వీడియో  సినిమాపై అంచనాలు పెంచింది.

విజయ్ ఖాకీ డ్రెస్‌‌లో కత్తిని పట్టుకుని స్టైలిష్‌‌గా నడుచుకుంటూ రావడం, దానికి అనిరుధ్ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోరు మరింత క్యూరియాసిటీని పెంచింది. వీడియో చివరిలో విజయ్ కత్తితో తన మీసాన్ని తిప్పడం హైలైట్‌‌గా నిలిచింది. పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  బాబీ డియోల్, మమితా బైజు, ప్రియమణి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  యగదీష్ పళనిస్వామి, లోహిత్ కలిసి కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ  చిత్రాన్ని విడుదల  చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.