
తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay thalapathy) హీరోగా వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ లియో(Leo). స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమా టికెట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.
విక్రమ్ లాంటి సూపర్ హిట్ తరువాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం, అందులోనే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్ ఫా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షూ చూసేందుకు ఎగబడుతున్నారు. కేవలం తమిలంలోనే కాదు.. మిగతా భాషల ప్రేక్షకులు కూడా సొంత సినిమాలను పక్కనపెట్టేసి మరీ లియో కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఆన్లైన్ లో లియో టికెట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.
దీంతో లియో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ రేట్స్ భారీగా పెంచేశారు. ఒక్కో ప్రస్తుతం తమిళనాడు, బెంగుళూరు లాంటి సిటీలలో లియో ఒక్కో టికెట్ రూ.1500 నుండి రూ.2500 వరకు పెంచేశారు. అంత రేటు పెట్టిన కూడా క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడై పోయాయి లియో టికెట్స్. ఇవన్నీ చూస్తుంటే లియో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ సినిమా దుమ్మురేపుతోంది. యుఎస్ ప్రీమియర్స్ లో ఇప్పటికే టాప్ లో నిలిచింది ఈ సినిమా. మరి రిలీజ్ కు ముందే ఈ రేంజ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా.. రిలీజ్ తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.