పుష్ప 2 లో సేతుపతి నటించడం లేదు

పుష్ప 2 లో సేతుపతి నటించడం లేదు

విజయ్ సేతుపతి ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడంటే ఆ సినిమా వేల్యూ కచ్చితంగా పెరుగుతుంది. అందుకే తమిళంతో పాటు తెలుగు, మలయాళ, హిందీ ఫిల్మ్ మేకర్స్​ కూడా ఆయన్ని ఏరికోరి తమ సినిమాలకు తీసుకుంటున్నారు. ‘పుష్ప’లోని భన్వర్‌‌‌‌సింగ్ పాత్రకి సుకుమార్‌‌‌‌ కూడా సేతుపతిని సెలెక్ట్ చేశాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన ఆ రోల్ చేయలేకపోయాడు. కానీ పార్ట్ 2లో మాత్రం నటించబోతున్నాడంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఆల్రెడీ ఓకే చెప్పేశాడని, ఓ బలమైన పాత్రలో కనిపిస్తాడని, ఆయనకి జోడీగా ప్రియమణి నటిస్తుందని.. ఇలా రకరకాలుగా న్యూస్ వినిపిస్తోంది. అయితే ఇది నిజం కాదని విజయ్ సేతుపతి పీఆర్‌‌‌‌ టీమ్‌‌ నిన్న తేల్చేసింది. షారుఖ్‌‌ ‘జవాన్‌‌’లో తప్ప మరే సినిమాలోనూ సేతుపతి విలన్‌‌గా నటించడం లేదని, తెలుగులో అయితే అస్సలు కమిటవలేదని క్లారిటీ ఇచ్చింది. దాంతో ‘పుష్ప 2’ విషయంలో వచ్చిన వార్తలకు ఫుల్‌‌స్టాప్ పడింది.