Vijay Sethupathi: 46 ఏళ్ల స్టార్‌ 60 ఏళ్ల లుక్‌..ఫ్యాన్స్ ఫిదా

Vijay Sethupathi: 46 ఏళ్ల స్టార్‌ 60 ఏళ్ల లుక్‌..ఫ్యాన్స్ ఫిదా

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ మెర్రీ క్రిస్మస్. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న రిలీజై హిట్ ను సొంతం చేసుకున్నాడు. చాలా కాలం తర్వాత విజయ్ సేతుపతికి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యారు.  ప్రస్తుతం విజయ్ సేతుపతి న్యూ లుక్ ఒకటి వైరల్ అవుతోంది. ఇప్పుడు ఫ్యాన్స్ అంతా తన లేటెస్ట్ లుక్ గురించి మాట్లాడుకుంటున్నారు.  

రీసెంట్గా విజయ్ సేతుపతి(Vijaysethupathi) బర్త్డే స్పెషల్గా దిగిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఆయన బర్త్డే స్పెషల్గా అభిమానులు పెద్ద ఎత్తున హడావుడి చేశారు.ఈ క్రమంలో తమిళ నటి అనుకృతి వ్యాస్(Anukreethy Vas) తన ఇంస్టాగ్రామ్లో విజయ్ సేతుపతితో కలిసి తీసుకున్న ఫోటో షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

ఈ ఫోటోలో విజయ్ సేతుపతి లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఈ ఫొటోలో విజయ్ వైట్ కుర్తాలో తెల్లటి జుట్టు, తెల్ల గడ్డంతో పాటు నెరిసిన మీసాలతో 45 ఏళ్ల వయసులోనే 60 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దీంతో విజయ్  ఫోటోను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేసేస్తున్నారు. ఈ లుక్ విజయ్ నెక్స్ట్ మూవీ కోసం మేకప్‌ అయ్యాడని తెలుస్తోంది.

ఇక ఫోటో షేర్ చేసిన అనుకృతి వ్యాస్ సినిమాల విషయానికి వస్తే..సినిమాల్లో పెద్దగా పరిచయం లేకున్న..గ్లామర్ ప్రపంచానికి తను ఎవరో తెలుసు.25 ఏళ్ల వయస్సులోనే 2018 మిస్ ఇండియాగా కిరీటాన్ని సొంతం చేసుకుంది.

తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన డిఎస్పి (DSP) మూవీలో నటించింది. రీసెంట్గా తెలుగులో రవితేజ టైగర్ నాగేశ్వర రావు మూవీలో జయవాణి క్యారెక్టర్ లో నటించింది.