
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. త్వరలో ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘ఫీనిక్స్’పేరుతో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రముఖ స్టంట్ మాస్టర్ అనల్ అరసు దర్శకత్వం వహించాడు. గతంలో నానుమ్ రౌడీ ధాన్, సింధుబాద్ లాంటి చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన సూర్యకు హీరోగా ఇది డెబ్యూ మూవీ.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఇంధ వంగికో’అనే రెండో పాటను విడుదల చేశారు. సామ్ సిఎస్ ఈ పాటను కంపోజ్ చేశాడు. బాబా భాస్కర్ కోరియోగ్రఫీలో ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్‌తో సూర్య సేతుపతి ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ చిత్రం తనకు సరైన లాంచింగ్‌గా భావిస్తున్నారు. జులై 4న సినిమా విడుదల కాబోతోంది.
తమిళ, తెలుగు, మలయాళం మరియు హిందీ చిత్ర పరిశ్రమలలో అనల్ అరసు రాణిస్తున్నాడు. ముఖ్యంగా, షారుఖ్ ఖాన్ "జవాన్" చిత్రంలో అతని పనికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అతను "రౌడీ రాథోడ్" మరియు "కత్తి" వంటి చిత్రాలలో కూడా స్టంట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు.