మొండెం లేని తలతో మొదలయ్యే కథ.. కాట్టాన్‌‌ ఎవరు..?

మొండెం లేని తలతో మొదలయ్యే కథ.. కాట్టాన్‌‌ ఎవరు..?

వైవిధ్యమైన పాత్రలతో అలరించే వెర్సటైల్ యాక్టర్‌‌‌‌ విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఎం. మణికందన్ కాంబినేషన్‌‌లో వస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘కాట్టాన్’. రూరల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందిన డార్క్ కామెడీ సస్పెన్స్‌‌ వెబ్ సిరీస్‌‌ ఇది. శనివారం (మార్చి 14) ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు.  ‘మొండెం లేని ఒక మనిషి తల దొరకడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తల ‘ముత్తు’ (విజయ్ సేతుపతి) అనే వ్యక్తిదని పోలీసులు గుర్తిస్తారు. 

అయితే అతను ఎవరు అని పోలీసులు జరిపే ఇన్వెస్టిగేషన్‌‌లో ఆశ్చర్యపోయే విషయాలు తెలుస్తుంటాయి. కొన్నేళ్లు తను వాచ్ మెకానిక్‌‌గా పనిచేశాడని, ఆపై ఏనుగుల ట్రైనర్‌‌‌‌ అని, ఆ తర్వాత ముంబైకి షిప్ట్ అయ్యాడని ఇన్వెస్టిగేషన్‌‌లో తెలుస్తుంది. కానీ అతను నేరస్తుడా, లేక సామాన్యులకు అండగా నిలిచే హీరోనా, అతన్ని ఎవరు చంపారు అనే విషయం మాత్రం అంతుబట్టదు. 

అంతేకాదు తల మాత్రమే దొరికింది.. మరి శరీరం ఏమైంది అనే మిస్టరీ కూడా సిరీస్‌‌పై ఆసక్తిని పెంచుతోంది.   విజయ్ సేతుపతితో పాటు మిలింద్ సోమన్, సుదేవ్ నాయర్, ముత్తుకుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఎం. మణికందన్‌‌తో పాటు బి. అజిత్ కుమార్ డైరెక్ట్‌‌ చేశారు.  మార్చి 27 నుంచి జియో హాట్‌‌స్టార్‌‌‌‌లో స్ట్రీమింగ్ కానుంది.