తమిళనాడు సీఎం గా జోసెఫ్ విజయ్ మే 10, 2026 ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం గా విజయ్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఫైల్ పై తొలి సంతకం చేశారు. మహిళ భద్రత ఫైల్ పై రెండో సంతకం..తమిళనాడులో డ్రగ్స్ నియంత్రణపై మూడో సంతకం చేశారు.
సీఎం గా తొలి ప్రసంగం చేశారు విజయ్. ప్రజల కష్టాలు నాకు తెలుసు.. నేనూ ఎన్నో బాధలు, కష్టాలుపడి పైకి వచ్చినవాణ్ణి.. ప్రజలకు అండగా పారదర్శంగా పాలన చేస్తానని హామి ఇచ్చారు. సినిమాల్లో నన్ను ఆదరించి ఉన్నతస్థాయిలో నిలిపారు. ఎన్ని అవమానాలు ఎదురైనా అండగా ఉన్నారని కృతజ్ణతలు తెలిపారు.
‘‘నేనేమీ దేవదూతని కాదు, సాధారణ మనిషినే..రాత్రికి రాత్రే ఏ అద్భుతాలూ చేయలేను..రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పులో ఉంది..గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసింది అంటూ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు’’ సీఎం విజయ్.
తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. తమిళనాడు సీఎంగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టారు. విజయ్ తోపాటు 9మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త మంత్రుల చేత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అక్లేకర్ ప్రమాణం చేయించారు. మంత్రులలో టీవీకే పార్టీ సీనియర్ నేతలు ఆధవ్ అర్జునా,కె.ఎ. సెంగోట్టయన్ లు ఉన్నారు.
