సీఎంగా పదవీబాధ్యతలు మరుక్షణమే గత డీఎంకే ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత (డీఎంకే) ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసింది.. రాష్ట్ర ప్రభుత్వంరూ.10లక్షల కోట్ల అప్పుల్లో ఉంది.. నేనేమీ దేవదూతనే కాదు. సాధారణ మనిషినే.. రాత్రి రాత్రే ఏ అద్భుతాలు చేయలేను. త్వరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతప్రతం విడుదల చేస్తానన్నారు సీఎం జోసెఫ్ విజయ్.
సీఎం గా తొలి ప్రసంగం చేశారు విజయ్. ప్రజల కష్టాలు నాకు తెలుసు.. నేనూ ఎన్నో బాధలు, కష్టాలుపడి పైకి వచ్చినవాణ్ణి.. ప్రజలకు అండగా పారదర్శంగా పాలన చేస్తానని హామి ఇచ్చారు. సినిమాల్లో నన్ను ఆదరించి ఉన్నతస్థాయిలో నిలిపారు. ఎన్ని అవమానాలు ఎదురైనా అండగా ఉన్నారని కృతజ్ణతలు తెలిపారు.
