Durga Temple VIP Entry Row: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి దర్శనార్ధం భక్తులు భారీగా పోటెత్తడంతో అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటలకు పైగా సమయం పడుతోంది. దుర్గగుడి అధికారులు, పోలీసులు వీఐపీల సేవలోనే తరిస్తుండటంతో, అనధికార వీఐపీలు ఓం టర్నింగ్ నుంచి నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. చిన్న రాజగోపురం దగ్గర వీఐపీలు బారులు తీరుతుండటంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఎండోమెంట్ కమిషనర్ ఆగ్రహం:
భక్తుల రద్దీతో పాటు ఇబ్బందికర పరిస్థితులను గమనించిన ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ వెంటనే రంగంలోకి దిగి ఓం టర్నింగ్ దగ్గరకు చేరుకున్నారు. మెయిన్ గేటు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఎందుకు పంపుతున్నారంటూ అక్కడ విధుల్లో ఉన్న పోలీసులపై ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రోటోకాల్ ఉన్నవాళ్లనే లోపలికి పంపండి:
ఈ క్రమంలోనే గేటుకు తాళాలు వేయించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, కేవలం సరైన అనుమతి, ప్రోటోకాల్ ఉన్నవారిని మాత్రమే ఆ గేటు ద్వారా లోపలికి అనుమతించేలా చర్యలు చేపట్టారు. సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు స్టార్ట్ చేశారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ, అధికారుల పర్యవేక్షణకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులు పరిశీలన వీడియో సహాయపడుతుంది.
