Vinaraa Salaar: వినరా మరిగే గరళం మధ్యన జీవంరా..సలార్ నుంచి కొత్త సాంగ్ రిలీజ్

Vinaraa Salaar: వినరా మరిగే గరళం మధ్యన జీవంరా..సలార్ నుంచి కొత్త సాంగ్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన తాజా చిత్రం సలార్(Salaar). కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.  

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి సోల్ ఫుల్ ఎమోషల్ సాంగ్ను రిలీజ్ చేశారు మేకర్స్. వినరా..ఈ పగలు..వైరం మధ్యన త్యాగంరా, వినరా రగిలే మంటల మధ్యన మంచేరా, వినరా మరిగే గరళం మధ్యన జీవం రా’ అంటూ ఈ పాట సాగుతుంది.

ఈ పాటకు కృష్ణకాంత్ రాసిన సాహిత్యం అందరినీ కట్టిపడేస్తోంది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించగా..సచిన్  బస్రూర్ ప్రాణం పెట్టి పాడాడు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతోంది. దీంతో ఈ రెండు పాత్రలకి సంబంధించిన సన్నివేశాలపై..కట్ చేసిన ఈ పాట ..భావోద్వేగాలతో ఆడియన్స్ను ఆకట్టుకుంటోంది.