కలియుగ వింత.. కుక్కకు సీమంతం... వీడియో వైరల్

కలియుగ వింత.. కుక్కకు సీమంతం... వీడియో వైరల్

సాధారణంగా మహిళలకు సీమంతం  చేస్తుంటారు. కానీ ఇటీవలికాలంలో పెంపుడు జంతువులకు కూడా సీమంతం చేస్తున్నారు. గతంలో కొంతమంది ఆవులు, పిల్లులకు కూడా సీమంతం చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే తాజాగా పెంపుడు కుక్క కు ఓ మహిళ సీమంతం చేశారు.ఓ జంతు ప్రేమికుడు తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న పెంపుడు కుక్కకు సీమంతం చేసిన ఘటనపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా కర్నాటకలో ఓ కుక్కకు సీమంతం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది,

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఒక దానిని చూస్తే జనాలు ఇదెక్కడి విడ్దూరం అని ఆశ్చర్య పోతున్నారు.  మనుషులకు.. జంతువులకు తేడా లేదని నిరూపించిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో దుమ్ము రేపుతోంది.  సాధారణంగా జనాలు విశ్వాసం గల జంతువైన శునకాన్ని పెంచుకుంటారు.  దానిని కూడా కుటుంబ సభ్యుల వలె ట్రీట్ చేస్తుంటారు.  ఇంట్లో వారిని ఎంత ప్రేమగా.. ఆప్యాయంగా చూస్తారో.. కుక్కను కూడా అలానే చూస్తారు.  కించిత్తు అస్వస్థతకు లోనైందని గుర్తించారా.. ఇక అంతే అది కోలుకొనేంతవరకు చాలా జాగ్రత్తగా చూస్తుంటారు.  

కుటుంబసభ్యుల పుట్టిన రోజు వేడుకలకు కేక్ కట్ చేసినట్లే ... శునకాల పుట్టిన రోజుకు కేక్ కట్ చేయడం... పిల్లలు పుడితే బారసాల చేయడం వంటి వేడుకలు చేస్తూ.. తమ ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.  అయితే ఇప్పుడు తాజాగా కర్నాటకలోని గదక్ జిల్లాకు చెందిన అశోక్ అనే వ్యక్తి ఓ శునకానికి సీమంతం చేశారు.  వారింట్లో ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు.  ప్రస్తుతం అది గర్భవతి కావడంతో సీమంతం పేరంటం నిర్వహించారు.  ఆ ఇంటిల్లిపాది చుట్టుపక్కల మహిళలు అంతా కలిసి దానికి సీమంతం చేశారు.  శునకం సీమంతానికి పండ్లు, పూలు పెట్టారు. దాని కోసం ఓ చీరను కొనుక్కొచ్చి చుట్టూ చుట్టారు. బొట్టు పెట్టి హారతి కూడా ఇచ్చారు. ఈ తతంగం అంతా ఓ మహిళకు సీమంతం చేస్తే ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే ఏదీ తక్కువ కాకుండా శునకానికి సీమంతం చేశారు. ఇప్పుడు ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేయగా చాలా మంది రకరకాలుగా స్పందిస్తున్నారు.