రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆయన నటించిన చిత్రం 'ది రాజా సాబ్' (The Raja Saab) ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. కానీ, రెబల్ స్టార్ తనపై నమ్మకం ఉంచిన నిర్మాతలకు ఒక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారితో మరో సినిమా చేస్తానని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
మెహర్ రమేష్, వి.వి. వినాయక్‌లతో ప్రభాస్!
ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. సీనియర్ డైరెక్టర్ వి.వి. వినాయక్, స్టైలిష్ డైరెక్టర్ మెహర్ రమేష్‌లతో ప్రభాస్ దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రభాస్ వీరికి మళ్ళీ అవకాశం ఇస్తున్నారా? లేక వీరి కాంబినేషన్‌లో ఏదైనా కొత్త ప్రాజెక్ట్ సెట్ కాబోతుందా? అని ఆరా తీస్తున్నారు.
అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కలయిక కేవలం స్నేహపూర్వకమైనదే! వి.వి. వినాయక్ నివాసంలో జరిగిన ఒక ప్రైవేట్ పార్టీకి ప్రభాస్, మెహర్ రమేష్ హాజరయ్యారు. ఆ సమయంలో సరదాగా దిగిన ఈ సెల్ఫీని మెహర్ రమేష్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
కల్కి 2' షూటింగ్‌లో ప్రభాస్ ఎంట్రీ!
డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజువల్ వండర్ 'కల్కి 2898 AD' సీక్వెల్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొంటున్నారు. ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. మార్చి మొదటి వారంలో ప్రభాస్ ఈ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం. పురాణాలకు, సైన్స్ ఫిక్షన్‌కు ముడిపెడుతూ రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
రాబోయే భారీ చిత్రాలు ఇవే!
ప్రభాస్ కేవలం 'కల్కికి 2' మాత్రమే పరిమితం కాకుండా, బాక్సాఫీస్‌ను షేక్ చేసే మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా 'ఫౌజీ' (Fauzi) దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇందులో ప్రభాస్ లుక్ సరికొత్తగా ఉంటుందని టాక్. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందనున్న 'స్పిరిట్' త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు.వరుస పరాజయాలు ఎదురైనా, ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు సదా, ఆయన రాబోయే 'కల్కి 2', 'స్పిరిట్' చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
Timeless bonds 🤍
— Meher Raamesh (@MeherRamesh) February 26, 2026
friendly talks 💗
Pure love ❤️
Dear Big brother #vinyakvv ❤️
Darling #Prabhas ❤️ pic.twitter.com/pbvaMFGpt3
