Virat Kohli Liz Laz: వామ్మో ఒకే ఒక్క లైక్.. సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తాజాగా మోడల్ లిజ్‌లాజ్ పోస్ట్ ని లైక్ చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. దీనిపై నెట్టింట మీమ్స్‌తో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఆ మోడల్ పేరు సామాజిక మాధ్యమంలో ట్రెండింగ్ అయిపోయింది. ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ ఫోటోలతో కూడిన పోస్టును కోహ్లీ లైక్ చేయడం వైరల్ అయింది. ఆమెను ఫాలో కానప్పటికీ లైక్ కొట్టడం తీవ్ర చర్చకు దారి తీసింది. జర్మనీకి చెందిన ఈమె 'గోల్డెన్ అవర్ షాట్స్' అంటూ తన ఫోటోలను షేర్ చేస్తూ, ఉంటుంది. జనవరి 30న పెట్టిన ఈ పోస్టుకు కోహ్లీ లైక్ కొట్టడంతో, అతడి అభిమానులు సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు.
ఎవరీ లిజ్‌లాజ్?:
లిజ్ లాజ్ జర్మనీకి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్.. సౌతాఫ్రికాకు చెందిన మూలాలు ఉన్నాయి.. ఎంఎస్సీ సైకాలజీ పూర్తి చేసి, వ్లోగర్, సింగర్‌గా తన ఇన్ స్టా ఐడీని పెట్టుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ట్రావెల్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ కంటెంట్, మ్యూజిక్ వీడియోలని నెట్టింట షేర్ చేస్తుంది. కాగా ఆర్సీబీకి అభిమానిని అంటూ తాజాగా ఓ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుంది. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అద్వైత్ వైద్య ఆమెతో ఫోటో షూట్ చేయగా... వాటిని ఇన్ స్టాలో పంచుకుంది. ఇప్పటి వరకూ లిజ్‌లాజ్‌కు దాదాపు 4.27 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 274 పోస్టులు చేశారు. ఇక ఆమె పోస్టుకు ఏకంగా కింగ్ కోహ్లీనే లైక్ చేయడంతో ఒక్కసారిగా లింజ్ లాజ్ ఫేమస్ అయిపోయింది.
అల్గారిథం గ్లిచ్?:
అప్పట్లో అవనీత్ కౌర్ ఫోటోకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టడంతో పెద్దఎత్తున చర్చ జరిగింది. ఇన్ స్టా ఫీడ్ క్లియర్ చేస్తున్న సమయంలో యాక్సిడెంటల్‌గా జరిగిపోయిందని.. అల్గారిథం గ్లిచ్ అంటూ విరాట్ క్లారిటీ ఇచ్చాడు. రిసెంట్ గా సేమ్ సిట్యువేషన్‌ను నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యుజ్వేంద్ర చాహల్ తాజా లైక్‌పై స్పందిస్తూ, 'అల్గారిథమ్' అని ఎమోజీతో కౌంటర్ ఇచ్చాడు. కొన్నిసార్లు మనం లైక్ చేయని పోస్టులు కూడా మన ఫీడ్‌లో కనిపిస్తుంటాయి.. ఇది ఎవరికైనా జరగొచ్చని విరాట్ కోహ్లీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

