సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ రేసులో 'కోహ్లీ' టాప్.. టాలీవుడ్ నుండి అతనే నెంబర్ -1.!

సెలబ్రిటీల బ్రాండ్ వాల్యూ రేసులో 'కోహ్లీ' టాప్.. టాలీవుడ్ నుండి అతనే నెంబర్ -1.!

బాక్సాఫీస్ కలెక్షన్లు, అడ్వర్టైజ్‌మెంట్స్ ద్వారా వచ్చే కోట్ల రూపాయల సంపాదన మాత్రమే ఒక సెలబ్రిటీ రేంజ్‌ను డిసైడ్ చేయలేవు. జనాల్లో వారిపై ఉన్న నమ్మకం, సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్, బ్రాండ్ పవర్ ఆధారంగా కూడా లెక్కిస్తారు. లేటెస్ట్ గా 'ఫార్చ్యూన్ ఇండియా - ఇంటర్‌బ్రాండ్' (Fortune India-Interbrand) సంస్థలు సంయుక్తంగా భారతదేశంలోనే మొదటిసారిగా మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీల జాబితాను విడుదల చేశాయి. ఈ క్రేజీ లిస్ట్‌లో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా టాప్-3 స్థానాలను కైవసం చేసుకున్నారు.

కింగ్ కోహ్లీ ..

క్రికెట్ పిచ్‌పైనే కాదు, బ్రాండ్ మార్కెట్‌లోనూ కోహ్లీయే 'కింగ్' అని నిరూపించుకున్నాడు. ఒక వరల్డ్-క్లాస్ క్రికెటర్ గా అతనికున్న జెన్యూన్ ఇమేజ్, హెల్త్ అండ్ ఫిట్‌నెస్ బ్రాండ్స్‌కు అతను ఇచ్చే ప్రాధాన్యత అతడిని నెం.1 స్థానంలో నిలబెట్టాయి. ఇండియాలో కోహ్లీ బ్రాండ్ వాల్యూ  రూ. 3,542 కోట్లు గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్ అథ్లెట్లలో ఒకరిగా కోహ్లీ సోషల్ మీడియా పవర్ ను చూపిస్తున్నారు.

బాద్‌షా షారుఖ్ ఖాన్ ..

మూడు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాను ఏలుతున్న షారుఖ్.. అడ్వర్టైజింగ్ రంగంలో అత్యంత నమ్మకమైన ఫేస్‌గా నిలిచాడు. ఈ బాలీవుడ్ బాద్‌షా బ్రాండ్ వాల్యూ సుమారు రూ. 3,017 కోట్లుగా లెక్కించారు. కింగ్  ముఖ్యంగా ‘హ్యుందాయ్’ కార్ల బ్రాండ్‌తో ఆయనకు ఉన్న 20 ఏళ్లకు పైబడిన బంధం, ఆయన బ్రాండ్ ఇమేజ్‌లోని స్థిరత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది.

ప్రియాంక చోప్రా ..

గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతుంది. ఈ ముద్దుగుమ్మ కేవలం నటిగానే కాకుండా ప్రొడ్యూసర్, బిజినెస్ ఉమెన్, ఇన్వెస్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని ప్రియాంక మూడో స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ప్రియాంక చోప్రా బ్రాండ్ వాల్యూ రూ. 2,507 కోట్లుగా ఉంది.

టాప్-10 లో‘ఐకాన్ స్టార్.. 

ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో క్రికెట్ లెజెండ్స్ ఎం.ఎస్. ధోని, సచిన్ టెండూల్కర్.. బాలీవుడ్ స్టార్స్ రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఆలియా భట్ చోటు దక్కించుకున్నారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం టాలీవుడ్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 'పుష్ప' సినిమాతో గ్లోబల్ రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. నేషనల్ లెవెల్ బ్రాండ్స్‌ను సైతం ఆకర్షిస్తూ ఈ టాప్-10 జాబితాలో నిలిచాడు.

 సౌత్ ఇండియా నుండి ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా అల్లు అర్జున్ సరికొత్త రికార్డు సృష్టించాడు. కేవలం సినిమా హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా, ప్రజలతో ఈ సెలబ్రిటీలు క్రియేట్ చేసుకున్న ఎమోషనల్ కనెక్ట్ , నమ్మకం మాత్రమే వీరిని బ్రాండ్ ప్రపంచంలో రారాజులుగా నిలబెట్టాయని ఈ సర్వే స్పష్టం చేసింది.