హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధులు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్పాన్సర్‌షిప్‌కు సంబంధించి ఓ పత్రికలో , సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. విశాక ఇండస్ట్రీస్ ను బద్నాం చేయడానికి కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. కుట్రపూరితంగా చేస్తున్న ఇలాంటి తప్పుడు కథనాలపై విశాక ఇండస్ట్రీస్ వివరణ ఇచ్చింది. అసలు హెచ్ సీఏ నిధులు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్పాన్సర్ షిప్ పై విశాక ఇండస్ట్రీస్ చెప్పిన వాస్తవాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
తప్పుడు కథనాలపై విశాఖ ఇండస్ట్రీస్ వివరణ ఇలా...
- 2004లో స్టేడియం నిర్మాణ సమయంలో HCA) తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉండేది.
- ఆ సమయంలో విశాకా ఇండస్ట్రీస్ లిమిటెడ్, IDBI Bank ద్వారా టర్మ్ లోన్ పొందేలా సహకరించి, కాంట్రాక్టర్ నిర్మాణ పనులు ఆపకుండా ఉండేలా ఆర్థికంగా మద్దతు ఇచ్చింది.
- 2004 అక్టోబర్16న విశాకా , HCA మధ్య కుదిరిన స్పాన్సర్‌షిప్ ఒప్పందానికి HCA ఎగ్జిక్యూటివ్ కమిటీ, జనరల్ బాడీ ఆమోదం ఇచ్చాయి.
- ఈ ఒప్పందం ప్రకారం రూ. 6.50 కోట్లు ప్రతిఫలంగా స్టేడియానికి నామకరణ హక్కులు ,ప్రకటన హక్కులు విశాకాకు ఇవ్వబడ్డాయి.
- ప్రభుత్వ సూచనల మేరకు స్టేడియం పేరును మార్చడం జరిగింది. దాంతో విశాకా యొక్క ఆర్థిక బాధ్యత కూడా అనుపాతంగా తగ్గించబడింది.
- 2011లో అప్పటి HCA అధ్యక్షుడు అర్షద్ అయూబ్ ఏకపక్షంగా స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని రద్దు చేశారు.
- స్టేడియం నామకరణ హక్కులు HCAకి రూ.100 కోట్లు రాబడతాయని పేర్కొంటూ, ఒక కార్పొరేట్ సంస్థతో చర్చలు పూర్తయ్యాయని ఎగ్జిక్యూటివ్ కమిటీకి తెలియజేశారు. అయితే అలాంటి ఒప్పందం ఏదీ అమలులోకి రాలేదు.
- దీనిపై విశాకా ఆర్బిట్రేషన్‌కు వెళ్లగా, 15.03.2016న ముగ్గురు సభ్యులతో కూడిన ఆర్బిట్రల్ ట్రిబ్యునల్, రద్దు చట్టవిరుద్ధమని తేల్చి, రూ.25.92 కోట్లు, వార్షిక 18% వడ్డీతో కలిపి చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
- ఆర్బిట్రల్ అవార్డును HCA, ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలియేషన్ చట్టంలోని సెక్షన్ 34,37 కింద సవాలు చేసినప్పటికీ, 19.07.2024న కమర్షియల్ కోర్టు,25.06.2025న హైకోర్టు ఆ పిటిషన్లను కొట్టివేశాయి.
- అనంతరం, 06.10.2025న సుప్రీంకోర్టు కూడా HCA దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను తిరస్కరించి, ఆర్బిట్రల్ అవార్డును స్థిరీకరించింది.
- గమనించదగ్గ విషయం ఏమిటంటే, విశాకా రూ.25.92 కోట్లు 18% వార్షిక వడ్డీకి బదులుగా రూ.17.50 కోట్లకు కోర్టు బయట సమస్యను పరిష్కరించేందుకు అంగీకరించింది.
- దీనిపై 16.08.2016న హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో సంయుక్త మెమో కూడా దాఖలు చేయబడింది. అయితే ఆ అవగాహనను తర్వాత అర్షద్ అయూబ్ ఉపసంహరించుకోవడంతో HCAపై మరింత ఆర్థిక భారం పడింది.
- కోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో ఎగ్జిక్యూషన్ ప్రక్రియలు ప్రారంభించబడ్డాయి.
- 24.11.2025న కమర్షియల్ కోర్టు, కెనరా బ్యాంక్ కు HCA ఖాతాలను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది.
- HCA మాజీ అధ్యక్షుడి తొలగింపుతో విశాకాను అనుసంధానించే ఆరోపణలు పూర్తిగా అసత్యం,ఆర్బిట్రేషన్ ప్రక్రియలకు సంబంధం లేనివి.
