మకుటం.. విడుదలకు సిద్ధం

మకుటం.. విడుదలకు సిద్ధం

విశాల్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలో వస్తున్న 99వ సినిమా ఇది. అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌ రాగా, బుధవారం మూవీ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌‌‌‌‌ చేశారు.

ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. అలాగే శుక్రవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేస్తామని తెలిపారు.  విశాల్ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ గెటప్స్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తుండటంతో పాటు తనే డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.  జీవీ ప్రకాష్ కుమార్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. జాన్ విజయ్, జయ ప్రకాష్, అజయ్, వంశీ కృష్ణ, అబూ సలీం, అర్జయ్, ఝాన్సీ ఇతర  పాత్రలు పోషిస్తున్నారు.