మొగుడు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

 మొగుడు ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్

విశాల్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా డిఫరెంట్ మేకోవర్‌‌‌‌‌‌‌‌తో  తను నటిస్తున్న మూవీ అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ను అందించాడు.  సుందర్ సి దర్శకత్వంలో తను నటిస్తున్న  ‘మొగుడు’ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని తెలియజేశాడు.  

తమన్నా హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్ కుమార్, ఖుష్బూ సుందర్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన  టైటిల్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విశాల్, సుందర్ సి కాంబోలో  ఆంబళ, మద గద రాజా చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు  ‘మకుటం’ లాస్ట్ షెడ్యూల్‌‌‌‌ మిగిలి ఉందని అప్‌‌‌‌డేట్ ఇచ్చాడు విశాల్. ఆయన డైరెక్షన్‌‌‌‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆర్‌‌‌‌‌‌‌‌బీ చౌదరి నిర్మిస్తున్నారు. ఇందులో విశాల్ డిఫరెంట్ గెటప్స్‌‌‌‌లో  కనిపించనున్నట్టు తెలుస్తోంది.  పెద్ద వయసులో ఉన్న గెటప్‌‌‌‌ కోసం కంప్లీట్ మేకోవర్‌‌‌‌‌‌‌‌ అయిన తన లుక్  సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్‌‌‌‌‌‌‌‌లో సినిమా విడుదల కానుంది.