Kannappa Box Office: కన్నప్పకి కఠిన పరీక్ష మొదలు.. పడిపోయిన కలెక్షన్లు.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Kannappa Box Office: కన్నప్పకి కఠిన పరీక్ష మొదలు.. పడిపోయిన కలెక్షన్లు.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

మంచు విష్ణు కీ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27 థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మొదటి రెండ్రోజులు మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ, మూడో రోజు ఆదివారం (జూన్ 29) వసూళ్లు పడిపోవడం గమనార్హం.

కన్నప్ప రెండో రోజు (శనివారం) ఇండియాలో రూ.7.15 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నాడు మాత్రం రూ.6.03 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించగలిగింది. మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లు.. కర్ణాటక, కేరళ, తమిళనాడులో రూ.2 కోట్లు, ఓవర్సీస్‌లో కోటి రూపాయల చొప్పున వరల్డ్‌ వైడ్‌గా 8 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వీకెండ్లో మంచి వసూళ్లు రాబట్టాల్సిన కన్నప్ప.. ఇలా తగ్గుముఖం పట్టడంతో.. బ్రేక్ ఈవెన్ చేరుకోవడం కష్టమంటున్నారు ట్రేడ్ నిపుణులు.

మూడు రోజుల్లో కన్నప్ప మూవీ ​​​​​.. ఇండియా వైడ్గా రూ.22.53 కోట్లు నెట్ వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ మార్కును దాటినట్లు అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు! ఇకపోతే, గ్రాస్ వసూళ్ల విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

అయితే, సోమవారం (జూన్ 30) నుంచే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద కఠిన పరీక్ష మొదలుకానుంది. సోమవారం తన జోరు చూపిస్తేనే బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇలానే కొనసాగితే రెండో వారం కన్నప్పకు కష్టాలు తప్పవని తప్పవని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ట్రేడ్ అనలిస్ట్ సాక్నిల్క్ ప్రకారం:

తొలిరోజున కన్నప్ప సినిమా రూ.9.35 కోట్లు వసూలు చేయగా, తెలుగు వెర్షన్ రూ.8.25 కోట్లు రాబట్టింది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రెండో రోజు 23.53% స్వల్పంగా తగ్గి రూ.7.15 కోట్లు వసూలు చేసింది, కానీ ఆదివారం ఈ సినిమా కాస్త తగ్గుముఖం పట్టింది. మూడో రోజు రూ.6.03 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించగలిగింది. 

కన్నప్ప మూవీ పాన్ ఇండియా భాషల్లో విడుదలైనప్పటికీ, తెలుగులో మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుంది. ఆదివారం, తెలుగు వెర్షన్ 42.33 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసుకుంది. తమిళ వెర్షన్ 24.83 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

కన్నప్ప సినిమా గురించి:

ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో విష్ణు నాస్తికుడు నుండి శివునికి అతిపెద్ద భక్తుడిగా మారే గిరిజన వేటగాడు 'తిన్నడు' పాత్రలో నటించారు. రుద్రుడిగా ప్రభాస్, శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్ మరియు కిరాతగా మోహన్ లాల్ వంటి నటులు అతిధి పాత్రలలో కనిపించారు. అలాగే, ఈ మూవీలో మోహన్ బాబు, శరత్ కుమార్, ప్రీతి ముఖుందన్, ముఖేష్ రిషి, బ్రహ్మాజీ మరియు బ్రహ్మానందం వంటి నటీనటులు తమ తమ పాత్రల్లో నటించి మెప్పించారు.