Sree Vishnu: నవ్వుల పండుగకు సిద్ధమైన 'విష్ణు విన్యాసం'.. రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Sree Vishnu:  నవ్వుల పండుగకు సిద్ధమైన 'విష్ణు విన్యాసం'.. రన్ టైమ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీ విష్ణు నవ్వుల పండుగకు సిద్ధమవుతున్నాడు. లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో నటించిన 'విష్ణు విన్యాసం'  ఫిబ్రవరి 27న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ , సాంగ్స్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కామెడీ ఎంటర్టెనర్ కి సంబంధించిన విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సేన్సార్ పూర్తి చేయించారు. 

సినిమా రన్ టైమ్ ..

ఈ 'విష్ణు విన్యాసం'  సినిమా రన్ టైమ్ కూడా ఖరారైంది. గంట యాభై తొమ్మిది నిమిషాల పాటు కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ అయిపోయాడు శ్రీ విష్ణు.  ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యూ/ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తక్కువ రన్ టైంతో ప్రేక్షకుల ముందుకు రానుండడం, శ్రీ విష్ణు కూడా ఈ సినిమా ఫుల్ కామెడీతో నిండిపోయి ఉంటుందని చెప్పడంతో ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్నా రు. 

రొమాంటిక్ ట్రాక్ తో.. 

యదునాథ్ మారుతీరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. నయన్ సారిక ఎంట్రీ తో మూవీలోని కథ మలుపు తిరుగుతుందని, ఆమె ఎంటరయ్యాక రొమాంటిక్ కామెడీ ట్రాక్ మరింత ఉత్సాహంగా మారుతుందని, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ ఎంటర్టైన్మెంట్ పాటు మంచి ఫీల్ ను కూడా అందిస్తాయని చెబుతున్నారు.  ఇక సెకండ్ హాఫ్ మొత్తం ట్విస్టులుం టూనే కామెడీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందని సమాచారం.

కామెడీ టైమింగ్‌తో..

శ్రీవిష్ణు  కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో దిట్ట. ఆయన నటించిన గత చిత్రాలైన 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆయన సినిమా అంటే వెనుకాడకుండా పెట్టుబడి పెడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. 'విష్ణు విన్యాసం' టీజర్, పాటలు ఇప్పటికే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండటం, సినిమాపై పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది. ఇందులో సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్, ‘సత్యం’ రాజేష్‌ వంటి నటీనటులు నటించారు. ఈ సినిమాకు రథన్‌ సంగీతం అందించారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.