శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘విష్ణు విన్యాసం’. యదునాథ్ మారుతి రావు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. హేమ, షాలిని సమర్పణలో సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. సుబ్రహ్మణ్యం నాయుడు జి, రామాచారి ఎం సహ నిర్మాతలు. వాలెంటైన్స్ డే సందర్భంగా శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. రధన్ కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్‌ను మధుశ్రీ, నరేష్ అయ్యర్ పాడారు.
‘‘మొదలే మొదలే మొదలే మన కథ మొదలే.. మనకు మనకు ఇకపై రంగుల కలలే.. ఇందుకేమో మనసు ఇన్నినాళ్లు వేచే.. ప్రాణ వాయువై తగిలేనా నీ గాలి వీచే.. అందమైన సొగసు అంబరాలు దించే.. అందుకోగ రారమ్మంటు గుండె సుడులు పెంచే..” అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. పాటలో శ్రీవిష్ణు, నయన్ సారిక కెమిస్ట్రీ ఆకట్టుకుంది. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో సినిమా విడుదల కానుంది.
