Crime Thriller: డార్క్ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్ఫెక్ట్ క్రైమ్ స్టోరీ.. ఇన్వెస్టిగేషన్‌తో థ్రిల్ ఇస్తున్న కొత్త టీజర్

Crime Thriller: డార్క్ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పర్ఫెక్ట్  క్రైమ్ స్టోరీ.. ఇన్వెస్టిగేషన్‌తో థ్రిల్ ఇస్తున్న కొత్త టీజర్

పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు విష్ణు విశాల్. తను హీరోగా రూపొందుతోన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ఎ పర్ఫెక్ట్ క్రైమ్ స్టోరీ అనేది ట్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్. కె ప్రవీణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శుభ్ర, ఆర్యన్ రమేష్, విష్ణు విశాల్ కలిసి నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది.

మంగళవారం (Sept30న) టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఓ హత్య దర్యాప్తుతో విష్ణు విశాల్ పాత్రను ఆసక్తికరంగా పరిచయం చేస్తూ సాగిన టీజర్ ప్రేక్షకులను డార్క్ అండ్ ఇంటెన్స్ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి  తీసుకెళుతుంది. ఓ సైకో తాను ఎవరిని హత్య చేయబోతున్నాడో గంట ముందు అనౌన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి మరీ మర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాడు. ఆ గంటలోపు అతన్ని పట్టుకోగలగాలి. పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తనదైన శైలిలో విష్ణు విశాల్ ఆకట్టుకున్నాడు.

‘రాట్ససన్’ విజయం తర్వాత అతను మరోసారి పోలీస్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నాడు. సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రల్లో నటించగా, సాయి రోనక్, తారక్ పొన్నప్ప, మాల పార్వతి, అవినాష్ అభిషేక్ జోసెఫ్ జార్జ్  ఇతర పాత్రలు పోషించారు. విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్’ చిత్ర  దర్శకుడు మను ఆనంద్ ఈ సినిమాకు కో రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వర్క్ చేస్తున్నాడు. జీబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.