క్రేజీ కాన్సెప్ట్ మూవీ గామి.. విశ్వక్ సేన్ అఘోర లుక్ వైరల్

క్రేజీ కాన్సెప్ట్ మూవీ గామి.. విశ్వక్ సేన్ అఘోర లుక్ వైరల్

కమర్షియల్‌‌ ఎంటర్‌‌టైనర్స్‌‌తో పాటు యూనిక్‌‌ కాన్సెప్ట్‌‌లతోనూ ప్రయోగాలు చేస్తున్నాడు విశ్వక్ సేన్. తాజాగా ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు.  విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ నటిస్తున్న  క్రేజీ ప్రాజెక్టు ‘గామి’. వి సెల్యులాయిడ్ సమర్పణలో  కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు. తాజాగా హైదరాబాద్ కామిక్ కాన్‌‌లో ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను లాంచ్ చేశారు. అఘోరా గెటప్‌‌లో విశ్వక్ సేన్ ఆశ్చర్యపరిచాడు. 

చుట్టూ చాలా మంది అఘోరాలు అతనిని తాకడానికి ప్రయత్నిస్తున్న పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఇందులో విశ్వక్‌‌కి చాలా రేర్ కండీషన్ ఉంటుందని,  అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ  అని, అతని గాఢమైన కోరిక కూడా మానవ స్పర్శ అని పోస్టర్ ద్వారా విశ్వక్ క్యారెక్టర్‌‌‌‌ను రివీల్ చేయడం ఆసక్తికరంగా ఉంది.  ఈ చిత్రంలో ‘కలర్ ఫోటో’  ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్‌‌గా నటిస్తుండగా, ఎం జి అభినయ, హారిక, మహ్మద్ సమద్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నరేష్ కుమారన్ సంగీతం అందిస్తున్నాడు.  త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు.