
మాస్ కా దాస్ విశ్వక్‌సేన్(Vishwak sen) నటిస్తున్న లేటెస్ట్ గామి(Gaami). వినూత్న కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను దాదాపు నాలుగేళ్ళ క్రితమే అనౌన్స్ చేశాడు విశ్వక్‌సేన్. విద్యాధర్(Vidyadhar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా కాలం క్రితమే రిలీజ్ కావాల్సింది. కానీ, కొన్ని అనుకోని కారణాల వల్ల షూటింగ్ కంప్లీట్ అవలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఒకానొక సమయంలో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ, అనుకోని విదంగా గామి సినిమా నుండి తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.
గామి సినిమాను తొందరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు యూవీ క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు గామి నుండి కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో విశ్వక్‌సేన్ అఘోరా లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంది. అతని అతి పెద్ద భయం మానవ స్పర్శ.. అతని గాఢమైన కోరిక కూడా మానవ స్పర్శే అంటూ పోస్టర్ కు ఇచ్చిన కొటేషన్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇవన్నీ చూస్తుంటే.. వినూత్న కథతో గామి సినిమా రానుందని క్లియర్ గా అర్థమవుతోంది. అంతేకాదు.. విశ్వక్‌సేన్ కు మరో హిట్ కన్ఫర్మ్ అని కూడా క్లియర్ గా అర్థమవుతోంది.
#Gaami - ??? ??????? ???? ?? ????? ?????. ??? ??????? ?????? ?? ????, ????? ????? ☯️
— UV Creations (@UV_Creations) January 28, 2024
A unique tale of one man and his journey to conquer his biggest fear ?
In cinemas soon!@VishwakSenActor @iChandiniC @mgabhinaya… pic.twitter.com/zSSUxI0Fqv
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గామి చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాలో విశ్వక్‌సేన్ జంటగా చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అభినయ కీలక పాత్రలో కనిపించనున్నారు. మరి వినూత్న కథతో రానున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకంటుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.