Gaami OTT Official: అఫీషియల్..గామి ప్రపంచంలోకి జీ5 పిలుస్తోంది..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Gaami OTT Official: అఫీషియల్..గామి ప్రపంచంలోకి జీ5 పిలుస్తోంది..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Vishwak sen) హీరోగా వచ్చిన సరికొత్త కథా చిత్రం గామి(Gaami). కొత్త దర్శకుడు విద్యాధర్(Vidyadhar) తెరకెక్కించిన ఈ సినిమాలో చాందిని చౌదరి(Chandini Chaudary) హీరోయిన్ గా నటించగా.. మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ. వినూత్న కథా, కథనాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. దాదాపు ఆరు సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలోని విజువల్స్, గ్రాఫిక్స్ కోసం టీమ్ చాలా కష్టపడ్డారు. అవే ఆడియన్స్ ను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లిన అనుభూతిని కలిగించాయి. 

గామి సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకున్న  విషయం తెలిసిందే. లేటెస్ట్ గా గామి  ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసింది జీ5. "మీ సీట్‌బెల్ట్స్ వేసుకొని రెడీగా ఉండండి. గామి ప్రపంచంలోకి ప్రయాణాన్ని జీ5 ద్వారా కొనసాగించండి" అందుకు ఏప్రిల్ 12న ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిపారు.

అయితే..ఈ సినిమా నిజానికి శుక్రవారమే (ఏప్రిల్ 5న) ఓటీటీలోకి వస్తుందని అందరు భావించారు. కానీ, వారం ఆలస్యంగా ఏప్రిల్ 12న రాబోతోంది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్  కానుంది. దీంతో విశ్వక్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో మంచి విజయాన్ని సాధించిన గామి సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

 గామి కథేంటంటే: 

శంకర్ (విశ్వక్ సేన్) హరిద్వార్‌లో ఉండే ఓ అఘోరా.  తనెవరనేది..తన గతమేంటనేది..అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు..ఈ జ్ఞాపకాలేం తనకు గుర్తుండవు.ఇతడికి ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది. పైగా మానవ స్పర్శను తట్టుకోలేని ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుంటాడు. దీంతో తోటి అఘోరాలంతా తనని శాపగ్రస్థుడుగా భావించి... ఆశ్రమం నుంచి వెలివేస్తారు. ఈ క్రమంలో తనని తాను తెలుసుకునేందుకు అన్వేషణ మొదలు పెడతాడు. తన సమస్యకు పరిష్కారం హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత శ్రేణుల్లో 36 ఏళ్లకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఉందని ఓ స్వామీజీ ద్వారా తెలుసుకుంటాడు. అక్కడికి చేరుకోవాలంటే.. ఎన్నో ప్రమాదాలను దాటుకుని వెళ్లాలి. వాటన్నింటినీ లెక్క చేయకుండా డాక్టర్‌ జాహ్నవి (చాందిని చౌదరి)తో కలిసి అక్కడికి బయలుదేరుతాడు శంకర్‌. ఆ తర్వాత ఏమైంది? మాలిపత్రాలు సాధించే క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? దేవదాసి దుర్గ (అభినయ) కూతురు ఉమ (హారిక), సీటీ333 (మహమ్మద్‌)ల జ్ఞాపకాలు.. అతడికి ఎందుకు వెంటాడుతుంటాయి? వాళ్లతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ సినిమా స్టోరీ.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)