నేరడిగొండలో సినీ జాతర..ప్రకృతి ఒడిలో విశ్వక్ సేన్ సినిమా షూటింగ్

నేరడిగొండలో సినీ జాతర..ప్రకృతి ఒడిలో విశ్వక్ సేన్ సినిమా షూటింగ్

నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం వెంకటాపూర్ గ్రామ సమీపంలోని కడెం నది పరీవాహక ప్రాంతంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌‌‌‌‌‌‌‌గా వస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమా షూటింగ్ ఇక్కడ జరుగుతోంది. 

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో విశ్వక్ సేన్‌‌‌‌‌‌‌‌ నటిస్తున్నారు. నేరడిగొండ మండలం వెంకటాపూర్ వద్ద గల పచ్చని ప్రకృతి అందాలు, కడెం నదీ తీర ప్రాంతం నేపథ్యంలో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాను షూటింగ్ జరుగుతుందనే సమాచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చారు.