Vishwambhara v/s Kantara2: విశ్వంభర పోటీగా కాంతార 2.. సంక్రాంతికి బిగ్గెస్ట్ క్లాష్

Vishwambhara v/s Kantara2: విశ్వంభర పోటీగా కాంతార 2.. సంక్రాంతికి బిగ్గెస్ట్ క్లాష్

2024 సంక్రాంతి క్రేజ్ ఇటీవలే ముగియగా.. అప్పుడే 2025 సంక్రాంతి సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు మేకర్స్. ఈ సీజన్ కోసం భారీ సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు సంక్రాంతి సీజన్ పై కర్చీఫ్ వెస్కొని కూర్చున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ విశ్వంభర(Vishwambhara) ఒకటి. ఇదే విషయాన్ని ఇటీవలే సంక్రాంతి కానుకగా అధికారికంగా ప్రకటించారు.

తాజా సమాచారం ప్రకారం మరో క్రేజీ మూవీ కూడా సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధంగా ఉందట. గత సంవత్సరం విడుదలై భారీ విజయాన్ని అందుకున్న కాంతార. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. డివోషనల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాను కేవలం రూ.16 కోట్లతో తెరకెక్కించగా.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ వన్(Kantara chapter 1) వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కూడా రిషబ్ శెట్టి(Rishab shetty) హీరోగా చేస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రీక్వెల్ కోసం రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారని టాక్. 

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి బరిలో దించాలని చూస్తున్నారట మేకర్స్. అదే సమయానికి మెగాస్టార్ విశ్వంభర సినిమా రానుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమా కోసం కూడా రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు మేకర్స్. ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టైటిల్ వీడియో ఆడియన్స్ లో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. 

Also Read: జరిగింది పెళ్లి కాదు.. ఎంగేజ్మెంట్.. అధికారికంగా ప్రకటించిన అదితి

ఇలా డివోషనల్ కంటెంట్ తో వస్తున్న రెండు సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తినెలకొంది. రెండు పాన్ ఇండియా సినిమాలు, దేనికది చాలా ప్రత్యేకం. ఈ రెండిటిలో ఏ సినిమా ప్రేక్షకుల అదరణపొందుతుంది అనే ఉత్కంఠ ఇప్పటినుండే మొదలైయింది. కానీ, సినిమా లవర్స్ మాత్రం రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వాలని, మరిన్ని కొత్త తరహా సినిమాలు రావాలని కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.