మెగాస్టార్ చిరంజీవి, దర్శకడు వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు ఇప్పటికే తెలిపారు.
ఈ రోజు ( ఆగస్టు 22, 2026 ) చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'విశ్వంభర' మూవీ టీమ్ విడుదల చేసిన కొత్త పోస్టర్, పవర్ ఫుల్ OST ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది. ముఖ్యంగా ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. పోస్టర్ లో చిరు లుక్ కూడా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
మరో వైపు 'విశ్వంభర లేట్‌గా వచ్చినా బాక్సాఫీస్ బద్దలైపోద్ది.. రాసిపెట్టుకోండి' అంటూ వశిష్ఠ చేసిన మాస్ కామెంట్ మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. దర్శకుడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమాపై టీమ్‌కు ఎంత నమ్మకం ఉందో అర్థమవుతోంది. సోషియో ఫాంటసీ కథ, భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, కీరవాణి సంగీతం.. ఇవన్నీ కలిసొస్తే 'విశ్వంభర' మెగాస్టార్ కెరీర్‌లో మరో స్పెషల్ మూవీగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు
ఈ మూవీలో చిరంజీవికి జోడీగా త్రిష నటిస్తున్నారు. ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అయితే సినిమా విడుదల తేదీపై మాత్రం ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. ఎప్పుడు వచ్చినా కంటెంట్‌తో థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో టీమ్ ముందుకు వెళ్తోంది. మరి వశిష్ఠ చెప్పినట్టుగా 'విశ్వంభర' నిజంగానే బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుందా? తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే ..
