Sundaram Master Trailer: నాలాగే స్వయంకృషితో.. మెగాస్టార్ మాటలకు ఏడ్చేసిన వైవా హర్ష

Sundaram Master Trailer: నాలాగే స్వయంకృషితో.. మెగాస్టార్ మాటలకు ఏడ్చేసిన వైవా హర్ష

వైవా హర్ష(Viva Harsha).. వైవా(Viva) అనే షార్ట్ ఫిల్మ్ తో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ లలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ ఫేమ్ తోనే మంచి మంచి సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు. తాజాగా వైవా హర్ష ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సుందరం మాస్టర్(Sundaram Master). RT టీం వర్క్స్, గోల్డెన్ మీడియా పతాకంపై మాస్ మహారాజా రవితేజ, సుధీర్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ సంతోష్ తెరకెక్కిస్తున్నాడు. 

ఫిబ్రవరి 23ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇందులో భాగంగా ఆయన హర్ష గురించి మాట్లాడగా కన్నీళ్లు పెట్టుకున్నారు వివా హర్ష. ఈ సందర్బంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. వైవా హర్ష లాంటి నటులు ఇంకా రావాలి. అతడు కూడా నాలాగే ఎవరితోడు లేకుండా స్వయంకృషితో ఎదిగాడు. ఆది ఎంతోమందికి ఆదర్శం. సోషల్ మీడియా ప్రభావం అంతగా లేని రోజుల్లోనే తన వీడియోలతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.

సుందరం మాస్టర్ ట్రైలర్ చాలా బాగుంది. చూస్తుంటే ఈ పాత్ర తన కోసమే పుట్టినట్టు అనిపిస్తోంది. కొత్త ప్రయోగాలను, కొత్త కథలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్. దీంతో మెగాస్టార్ తన సినిమా గురించి మాట్లాడటంతో ఎమోషనల్ అయ్యారు హర్ష. భవోద్వేగాని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.